News October 6, 2025

సర్ క్రీక్..! భారత్-పాక్‌కు ఇది ఎందుకు కావాలి?

image

రణ్ ఆఫ్ కచ్(GJ) – సింధ్ (PAK) మధ్య గల 100కి.మీ.ల సంగమ ప్రదేశం సర్ క్రీక్. అరేబియా సముద్రం, సింధు నది కలిసే ఈ ప్రాంతం మాదే అని ఇరు దేశాలు 78 ఏళ్లుగా వాదిస్తున్నాయి. అత్యంత వ్యూహాత్మక, బిలియన్ డాలర్ల విలువైన హైడ్రో కార్బన్ నిల్వలున్నట్లు భావించే ఈ జోన్ ఏ దేశానికి దక్కితే వారి ఆర్థిక, సైనిక పట్టు పెరుగుతుంది. పాక్ అక్కడకు సైన్యాన్ని పంపుతోందని భారత్ గుర్తించి వరుసగా స్ట్రాంగ్ వార్నింగ్స్ ఇస్తోంది.

Similar News

News January 24, 2026

సంతాన ప్రాప్తి కోసం రేపు ఏం చేయాలంటే..?

image

సంతాన ప్రాప్తి కోరేవారు రథ సప్తమి రోజు బియ్యప్పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. సూర్య నామాలు స్మరిస్తూ దాన్ని 7 రంగులతో నింపాలి. పద్మం మధ్యలో శివపార్వతులను ఉంచి, పక్కనే తెల్లని వస్త్రంపై సూర్యరథపు ప్రతిమను ఉంచి ఎర్రని పూలతో పూజించాలి. గోత్రనామాలతో సంకల్పం చెప్పుకోవాలి. దాన్ని బ్రాహ్మణుడికి దానమివ్వాలి. ఏడాది పాటు ప్రతి సప్తమికి ఉపవాసం ఉంటూ, సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి. తద్వారా ఫలితం ఉంటుంది.

News January 24, 2026

కెనడాను చైనా మింగేస్తుంది: ట్రంప్

image

చైనాతో వ్యాపారం చేస్తే కెనడాకే ప్రమాదమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. గ్రీన్‌లాండ్‌పై గోల్డెన్ డోమ్ ఏర్పాటుకు మద్దతివ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. ‘గోల్డెన్ డోమ్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలను కెనడా వ్యతిరేకిస్తోంది. నిజానికి అది వారి దేశాన్ని కూడా రక్షిస్తుంది. దానికి బదులుగా చైనాతో వ్యాపారం చేసేందుకే మొగ్గు చూపుతోంది. నిజానికి కెనడాని చైనా ఏడాదిలోనే మింగేస్తుంది’ అని పేర్కొన్నారు.

News January 24, 2026

ఐఫోన్ 18 ప్రో వివరాలు లీక్.. ధర ఎంతంటే?

image

iPhone 18 ప్రో సిరీస్‌కు సంబంధించిన కీలక వివరాలు లీక్ అయ్యాయి. ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్ డైనమిక్ ఐలాండ్‌తో కాకుండా అండర్‌ డిస్‌ప్లే ఏరియాతో రానున్నట్లు సమాచారం. కొత్తగా 2nm టెక్నాలజీతో తయారైన A20 ప్రో చిప్‌తో పాటు కెమెరాలో మెకానికల్ ఐరిస్‌ వంటి ఫీచర్లు వచ్చే అవకాశం ఉంది. భారత్‌లో ఈ ఏడాది సెప్టెంబరులో లాంచ్‌ కావొచ్చు. ధర విషయానికి వస్తే 18 ప్రో రూ.1,34,900, ప్రో మ్యాక్స్ రూ.1,49,900గా ఉండొచ్చు.