News October 7, 2025

‘SIR’ ఎన్నికల కమిషన్ విశేషాధికారం: SC

image

బిహార్‌లో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) ఎన్నికల కమిషన్ విశేషాధికారమని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఇందులో జోక్యం చేసుకోలేమని విచారణ సందర్భంగా పేర్కొంది. అందరి విధుల్లో తాము జోక్యం చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారని పిటిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అటు బిహార్‌లో ఫైనల్ ఓటర్ లిస్ట్‌ను ప్రకటించినట్లు కోర్టుకు EC తెలిపింది. రాజకీయ నాయకులే అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని వివరించింది.

Similar News

News October 7, 2025

మాజీ ప్రధాని దేవెగౌడకు అస్వస్థత

image

మాజీ ప్రధాని HD దేవెగౌడ(92) అస్వస్థతకు గురయ్యారు. యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్(UTI)తో బాధపడుతున్న ఆయనను నిన్న బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అందించిన వైద్యులు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.

News October 7, 2025

మలయాళ సూపర్‌స్టార్‌కు అరుదైన గౌరవం

image

మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నుంచి ఆయన COAS కమెండేషన్ కార్డ్ అందుకున్నారు. ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తూ మోహన్‌లాల్ ట్వీట్ చేశారు. ‘హానరరీ లెఫ్టినెంట్ కల్నల్ గుర్తింపు దక్కడం గర్వంగా ఉంది. ఆర్మీ చీఫ్‌, నా మాతృసంస్థైన టెరిటోరియల్ ఆర్మీకి ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. ఇటీవల ఆయన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.

News October 7, 2025

పుతిన్‌కు మోదీ బర్త్‌డే విషెస్

image

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ బర్త్‌డే సందర్భంగా ప్రధాని మోదీ ఫోన్ చేసి విషెస్ తెలియజేశారు. భారత్, రష్యా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఇరువురు నేతలూ ఆకాంక్షించారు. పుతిన్ భారత పర్యటన కోసం ఎదురుచూస్తున్నట్లు మోదీ తెలిపారు. కాగా ఈ ఏడాది డిసెంబర్‌లో రష్యా అధ్యక్షుడు ఇండియాలో పర్యటించనున్నారు.