News April 3, 2025
RCBని దెబ్బకొట్టిన సిరాజ్

ఏడేళ్ల పాటు ఆర్సీబీ తరఫున ఆడిన సిరాజ్ (GT) నిన్న మ్యాచ్ విన్నింగ్ స్పెల్‌తో ఆ జట్టునే దెబ్బ తీశారు. చిన్నస్వామి స్టేడియంలో తన బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నమోదు చేశారు. 4 ఓవర్లలో 19 రన్స్ మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టారు. ఆఖర్లో జోరు మీదున్న లివింగ్‌స్టన్‌ను ఔట్ చేసి భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నారు. మెగా వేలంలో ఆర్సీబీ సిరాజ్‌ను రిటైన్ చేసుకోలేదు. ఇప్పుడు ఆయనే ఆ జట్టుపై MOMగా నిలవడం విశేషం.
Similar News
News April 4, 2025
ఈ నెల 7 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్

AP: ఈ నెల 7 నుంచి రాష్ట్రంలోని అన్ని నెట్వర్క్ ఆస్పత్రుల్లో NTR వైద్య సేవలను నిలిపేస్తున్నట్లు ఏపీ స్పెషాల్టీ హాస్పిటల్స్ అసోసియేషన్ తెలిపింది. ప్రభుత్వం నుంచి రూ.3,500 కోట్ల బకాయిలు రావాలని, దీంతో ఆస్పత్రుల నిర్వహణ చేయలేకపోతున్నామని వెల్లడించింది. గతేడాది ఏప్రిల్ బకాయిలు కూడా ఇవ్వలేదని, చేసిన అప్పులు తీర్చలేకపోతున్నామని పేర్కొంది. ప్రభుత్వం స్పందించి రూ.1,500 కోట్లు మంజూరు చేయాలని కోరింది.
News April 4, 2025
IPL: నేడు లక్నోతో ముంబై అమీతుమీ

IPLలో ఇవాళ మరో ఆసక్తికర పోరు జరగనుంది. రాత్రి 7.30 గంటలకు లక్నో వేదికగా ముంబై, లక్నో మధ్య మ్యాచ్ జరగనుంది. తమకు అలవాటైన రీతిలోనే MI తొలుత వరుసగా మ్యాచులు ఓడింది. కానీ సొంతగడ్డపై KKRను చిత్తు చేసి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. అటు లక్నో కూడా 2 మ్యాచులు ఓడి ఒకదాంట్లో గెలిచింది. చివరిగా PBKSపై ఆ జట్టు చిత్తుగా ఓడిపోయింది. దీంతో ఇవాళ ముంబైని ఓడించి మళ్లీ విజయాల బాట పట్టాలని భావిస్తోంది.
News April 4, 2025
IPL: మ్యాచ్ కోసం హనీమూన్ క్యాన్సిల్ చేసుకున్నాడు

SRH తరఫున బరిలోకి దిగిన స్పిన్ ఆల్‌రౌండర్ కమిందు మెండిస్ ఇటీవలే తన గర్ల్‌ఫ్రెండ్ నిష్నిని వివాహమాడారు. అంతకుముందే హనీమూన్ ట్రిప్ కూడా ప్లాన్ చేసుకున్నారు. కానీ మ్యాచ్ కోసం దాన్ని క్యాన్సిల్ చేసుకుని కోల్‌కతా వచ్చేశారు. ఒకే ఓవర్ వేసిన అతడు ఒక వికెట్ పడగొట్టారు. బ్యాటింగ్‌లోనూ అద్భుతమైన షాట్లతో ఆకట్టుకున్నారు. 29 రన్స్ చేసి పర్వాలేదనిపించారు. వేలంలో అతడిని SRH రూ.75 లక్షలకు దక్కించుకుంది.