News January 27, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి సిరాజ్: ఆకాశ్ చోప్రా

CT-2025 జట్టులో సిరాజ్ చేరే అవకాశం ఉందని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డారు. CTకి బుమ్రా, షమీ, అర్ష్దీప్లను బీసీసీఐ ఎంపిక చేసిందన్నారు. గాయం నుంచి కోలుకున్న తర్వాత షమీ ఒక్క మ్యాచ్ ఆడలేదని, జట్టు ప్రకటన సమయంలో బుమ్రా ఫిట్నెస్పై రోహిత్ డౌట్ వ్యక్తం చేశారని గుర్తు చేశారు. వీరిద్దరిలో ఒకరు మిస్ అయితే కచ్చితంగా జట్టులో సిరాజ్ చేరతారని, ట్రోఫీ ఆడేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.
Similar News
News November 19, 2025
ఆ భయంతోనే ఛత్తీస్గఢ్ నుంచి ఏపీకి!

లొంగిపోయిన మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఎక్కడ తమ వివరాలు బయటపెడతారేమోనని మిగతా నేతలు భయపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో అనేక మంది ఛత్తీస్గఢ్ నుంచి APకి వచ్చి తలదాచుకుంటున్నారని సమాచారం. ఎలాంటి భయం లేకుండా లొంగిపోవడానికి రావాలని, తాము రక్షణ కల్పిస్తామని ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా చెప్పారు. అటు హిడ్మాను పట్టుకుని కాల్చి చంపినట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. హిడ్మా ఎన్కౌంటర్లోనే చనిపోయాడన్నారు.
News November 19, 2025
కన్నె స్వాములు తప్పక చూడాల్సిన స్థానం

శబరిమల యాత్రలో పేరూర్తోడు నుంచి 12KM దూరంలో కాళైకట్టి అనే కారడవి ఉంటుంది. నేడు ఇది పచ్చని తోటగా మారింది. ఈ స్థలానికి 2 ప్రాముఖ్యతలున్నాయి. ఓనాడు అయ్యప్ప స్వామి తన సైన్య వృషభాలను ఇక్కడే కట్టేశాడట. మరోనాడు మహిషీ మర్దనం చూడడానికి వచ్చిన పరమేశ్వరుడు తన వృషభ వాహనాన్ని ఇక్కడ బంధించాడట. తొలిసారి యాత్ర చేసే కన్నె స్వాములు ఇక్కడ కొబ్బరికాయలు కొడితే ఈశ్వరుడి అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. <<-se>>#AyyappaMala<<>>
News November 19, 2025
భారీ జీతంతో NTPCలో ఉద్యోగాలు

ఎన్టీపీసీ లిమిటెడ్ 4 ఎగ్జిక్యూటివ్(<


