News May 24, 2024

RCB నుంచి సిరాజ్, యశ్ దయాల్ ఔట్?

image

బెంగళూరు స్టేడియంలో మ్యాచులు గెలవాలంటే బౌలర్లకు పేస్ మాత్రమే ఉంటే సరిపోదని RCB కోచ్ ఆండీ ఫ్లవర్ అన్నారు. స్పెషల్ స్కిల్స్ ఉన్నవారు, ప్లాన్‌ను పక్కాగా అమలు చేసే తెలివైన బౌలర్లు కావాలని అభిప్రాయపడ్డారు. అలాగే తమ జట్టుకు పవర్ హిట్టర్స్ అవసరం ఉందని చెప్పారు. 2025లో మెగా వేలం నేపథ్యంలో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో సిరాజ్, దయాల్‌ సహా ఇతర బౌలర్లను ఆ జట్టు వదులుకోనుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Similar News

News December 14, 2025

సర్పంచ్ రిజల్ట్స్: ఉత్తర తెలంగాణలో బీజేపీ సత్తా

image

TG: ఉత్తర తెలంగాణలో బీజేపీ సత్తా చాటుతోంది. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో BRS కంటే ఎక్కువ సీట్లు కమలం పార్టీ మద్దతుదారులే సొంతం చేసుకున్నారు. నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకోవడం విశేషం. కాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4 ఎమ్మెల్యే సీట్లు గెలిచిన సంగతి తెలిసిందే.

News December 14, 2025

సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య.. తీరా రిజల్ట్ చూస్తే..

image

TG: సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మం. పీపడ్‌పల్లి సర్పంచ్ అభ్యర్థి చాల్కి రాజు (35) ఈ నెల 8న ఆత్మహత్య చేసుకున్నాడు. కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్ బరిలో దిగిన ఆయన.. ప్రచారానికి డబ్బులు లేకపోవడం, పోటీకి ప్రోత్సహించిన వారు మౌనంగా ఉండటంతో అయ్యప్ప మాలలో ఉండగానే ఉరేసుకున్నాడు. అయితే ఇవాళ్టి ఫలితాల్లో రాజు 8 ఓట్ల తేడాతో ప్రత్యర్థిపై విజయం సాధించారు. దీంతో ఆ గ్రామంలో మరోసారి ఎన్నికలు నిర్వహించనున్నారు.

News December 14, 2025

ఏపీలో ₹లక్ష కోట్లతో ‘సాగర్‌మాల’ ప్రాజెక్టులు

image

AP: ‘సాగర్‌మాల’ కింద APలో ₹లక్ష కోట్లతో 110 ప్రాజెక్టులు ఏర్పాటుకానున్నట్లు కేంద్రం వెల్లడించింది. పారిశ్రామిక వృద్ధికి వీలుగా రాష్ట్రంలో ఈ ప్రాజెక్టులు నెలకొల్పనున్నట్లు పార్లమెంటులో పేర్కొంది. పోర్టు ఆధారిత పరిశ్రమలు, ఆధునీకరణ, రోడ్డు, రైల్వే కనెక్టివిటీ పెంపు, కోస్టల్ కమ్యూనిటీ, షిప్పింగ్, జలమార్గాల అభివృద్ధి వంటివి ఇందులో ఉన్నాయి. వీటితో తీరప్రాంతం లాజిస్టిక్ హబ్‌గా మారుతుందని పేర్కొంది.