News March 24, 2025
దీపక్ చాహర్‌పై ఆసక్తికర పోస్ట్ చేసిన సోదరి

కట్టప్ప బాహుబలిని వెన్నుపోటు పొడిచే మీమ్‌ని ముంబై క్రికెటర్ దీపక్ చాహర్ సోదరి మాలతీ చాహర్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. నిన్న జరిగిన MI-CSK మ్యాచ్‌లో దీపక్ 25పరుగులతో పాటు ఒక వికెట్ తీసి చెన్నైకు సులువుగా విజయం దక్కకుండా అడ్డుకున్నారు. గత 7 సీజన్లలో CSK జట్టులో ఉన్న దీపక్ ప్రస్తుతం ముంబై తరపున ఆడుతున్నారు. దీంతో ఇన్నాళ్లూ ఆడిన జట్టుకు ద్రోహం చేస్తున్నట్లు అర్థం వచ్చేలా ఆమె ఫన్నీ మీమ్ షేర్ చేశారు.
Similar News
News March 26, 2025
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

గత 5 రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.100 పెరిగి రూ.81,950లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.110 పెరగడంతో రూ.89,400 వద్ద కొనసాగుతోంది. అటు వెండి ధర రూ.1000 పెరగడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,11,000గా ఉంది.
News March 26, 2025
సోనూసూద్ భార్యకు యాక్సిడెంట్.. ఇప్పుడెలా ఉందంటే?

రోడ్డు <<15881657>>ప్రమాదంలో<<>> గాయపడ్డ నటుడు సోనూసూద్ భార్య సోనాలీ ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని నాగ్‌పూర్ మ్యాక్స్ ఆసుపత్రి ప్రకటన విడుదల చేసింది. కోల్‌కతా నుంచి వచ్చిన సోనాలీని ఆమె సోదరి సునీత, మేనల్లుడు సిద్ధార్థ్ ఎయిర్‌పోర్టులో రిసీవ్ చేసుకొని ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రత అధికంగా ఉన్నా ఎయిర్‌బ్యాగులు తెరుచుకోవడంతో ప్రాణాలకు ముప్పు తప్పింది.
News March 26, 2025
యాడ్ ఫ్రీ ఇన్‌స్టా కోసం సబ్‌స్క్రిప్షన్.. ఎక్కడంటే?

యాడ్ ఫ్రీ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ కోసం సబ్‌స్క్రిప్షన్‌ను తేవాలని ‘మెటా’ యోచిస్తోంది. తాజాగా యూరప్‌లో ఈ విధానాన్ని అమలుచేసేందుకు సిద్ధమైంది. యూరోపియన్ నియంత్రణ సంస్థలకు ‘మెటా’ తన ప్రతిపాదలను పంపింది. మొబైల్‌లో యాడ్‌ఫ్రీ ఇన్‌స్టా కోసం నెలకు $14(రూ.1200), డెస్క్‌టాప్‌లో FB& INSTA కోసం 17 డాలర్ల వరకు ఉండనుంది. అక్కడ అమలైతే అన్నిచోట్లా తీసుకొచ్చే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.