News July 10, 2025

విజయసాయి రెడ్డికి మరోసారి సిట్ నోటీసులు

image

AP: లిక్కర్‌ స్కాం కేసులో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి సిట్‌ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 12న ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని అందులో పేర్కొంది. కాగా ఈ కేసులో ఇప్పటికే విజయసాయి ఒకసారి విచారణకు హాజరయ్యారు.

Similar News

News August 31, 2025

నీరు లేని చోటు నుంచి ఉన్న చోటుకు మార్చాం: హరీశ్ రావు

image

TG: తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజీని మార్చడం సొంత నిర్ణయం కాదని, క్యాబినెట్‌లో చర్చించామని హరీశ్ రావు అసెంబ్లీలో పేర్కొన్నారు. ‘నీరు లేని చోటు నుంచి ఉన్న చోటుకు మార్చాం. 2009-14 వరకు మీరే అధికారంలో ఉన్నారు కదా.. తుమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మట్టి ఎందుకు తీయలేదు? ప్రజాధనాన్ని ఎక్కడా దుర్వినియోగం చేయలేదు. ఆంధ్రా పాలనలో అన్యాయం జరిగింది కాబట్టే కాళేశ్వరం నిర్మించాం’ అని తెలిపారు.

News August 31, 2025

దోపిడీ చేసేందుకే ప్రాజెక్టు స్థలాన్ని మార్చారు: రేవంత్

image

TG: తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు అందుబాటులో ఉన్నాయని 2009, 14లో కేంద్రం చెప్పినా దోపిడీ చేసేందుకు ప్రాజెక్టు స్థలాన్ని మార్చారని సీఎం రేవంత్ ఫైరయ్యారు. ‘ఆ విషయం దాచి 2015లో ఉమా భారతి లేఖను పట్టుకుని హరీశ్ తప్పుదోవ పట్టిస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టొద్దని ఎప్పుడూ చెప్పలేదు. ఎత్తు తగ్గించుకోవాలని మాత్రమే వాళ్లు సూచించారు’ అని అసెంబ్లీలో తెలిపారు.

News August 31, 2025

ALERT: మూడు రోజులు భారీ వర్షాలు

image

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 3 రోజులపాటు భారీ వర్షాలు కురవనున్నాయి. TGలోని ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, కామారెడ్డి జిల్లాల్లో భారీ వానలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం కారణంగా రాబోయే 3 రోజులు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది.