News May 20, 2024

ఈసీకి చేరిన సిట్ నివేదిక

image

ఏపీ అల్లర్లపై సిట్ నివేదిక కేంద్ర ఎన్నికల సంఘానికి చేరింది. సిట్ ప్రాథమిక నివేదికను సీఎస్ జవహర్ రెడ్డి ఈసీకి పంపించారు. ఎన్నికల రోజు, అనంతరం జరిగిన ఘర్షణలపై రూపొందించిన నివేదికను సిట్ కొద్దిసేపటి క్రితమే డీజీపీ హరీశ్ గుప్తాకు అందజేసింది. అనంతరం దాన్ని ప్రభుత్వం ఈసీకి పంపించింది.

Similar News

News December 22, 2025

ఈ ప్రాంతాల్లో మద్యం, మాంసం, పొగాకు నిషేధం

image

పంజాబ్ ప్రభుత్వం శ్రీ ఆనంద్‌పూర్ సాహిబ్, తల్వండి సాబో, అమృత్‌సర్ గోల్డెన్ టెంపుల్ కారిడార్ ప్రాంతాలను పవిత్ర నగరాలుగా ప్రకటించింది. దీంతో ఆయా ప్రాంతాల్లో మద్యం, మాంసం, పొగాకు విక్రయాలను పూర్తిస్థాయిలో నిషేధించింది. ఈ నిర్ణయం తక్షణమే అమలవుతుందని CM భగవంత్ సింగ్ మాన్ తెలిపారు. ఈ పవిత్ర స్థలాలు కేవలం మతపరమైనని మాత్రమే కాదని సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలని మాన్ పేర్కొన్నారు.

News December 22, 2025

ఫోన్ ట్యాపింగ్.. మాజీ చీఫ్‌లకు నోటీసులు

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును సిట్ వేగవంతం చేసింది. తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్‌కు నోటీసులు జారీ చేసింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. 2016-20లో నవీన్ SIB చీఫ్‌గా ఉన్నప్పుడు ప్రభాకర్ రావు అతని కింద పనిచేసి ఆ తర్వాత చీఫ్ అయ్యారు. కాగా CP సజ్జనార్ నేతృత్వంలో ప్రభుత్వం కొత్తగా సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

News December 22, 2025

వల్వల్ పెయిన్ గురించి తెలుసా?

image

నార్మల్ డెలివరీ తర్వాత చాలామందికి యోని దగ్గర నొప్పి వస్తుంది. ఇన్ఫెక్షన్, కారణం లేకుండా నొప్పి వస్తుంటే దాన్ని వల్వల్ పెయిన్ అంటారు. ప్రసవ భయం, ఒత్తిడి వల్ల ఈ నొప్పి రావొచ్చు. సరైన చికిత్స తీసుకోకపోతే ఇది దీర్ఘకాలం ఉంటుంది. గైనకాలజిస్ట్‌ని కలిస్తే వెజైనల్ ఇన్ఫెక్షన్ టెస్ట్ చేస్తారు. అది నెగటివ్ వస్తే పెల్విక్ ఫ్లోర్ మజిల్ వ్యాయామాలు సూచిస్తారు. నొప్పిగా ఉంటే సబ్బులు, వెజైనల్ వాష్‌లు వాడకూడదు.