News May 20, 2024
ఏపీ అల్లర్లపై డీజీపీకి నివేదిక అందించిన SIT

AP: ఎన్నికల రోజు, ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన అల్లర్లపై సిట్ బృందం నివేదిక రూపొందించి.. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు అందజేసింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిలాల్లో మొత్తం 33 చోట్ల అల్లర్లు జరిగినట్లు అందులో పేర్కొంది.
1370 మందిపై FIR నమోదు చేయగా.. 124 మందిని అరెస్ట్ చేశామని, 94 మందికి నోటీసులు ఇచ్చినట్లు పేర్కొంది. 150 పేజీలతో కూడిన నివేదికను డీజీపీ.. కాసేపట్లో సీఈవో, సీఈసీకి పంపనున్నారు.
Similar News
News February 4, 2026
అదరగొట్టిన ఇషాన్.. ఏకంగా 32 స్థానాలు ఎగబాకి

టీమ్ ఇండియా యంగ్‌స్టర్ ఇషాన్ కిషన్ ఐసీసీ T20I ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపారు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సీరీస్‌లో అదరగొట్టడంతో ఏకంగా 32 స్థానాలు ఎగబాకి 32వ ప్లేస్‌కి చేరుకున్నారు. టీ20 వరల్డ్ కప్ ప్లేయింగ్-11లో ఇషాన్ చోటు దక్కించుకుంటే రెండు వారాల్లోనే టాప్-10కు చేరుతారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు అభిషేక్ శర్మ(917 పాయింట్లు) టాప్ బ్యాటర్‌గా కొనసాగుతున్నారు.
News February 4, 2026
కిచెన్ గార్డెనింగ్ ఇలా ఈజీ

కిచెన్ గార్డెనింగ్ చేయాలంటే కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. కిచెన్ ప్లాంట్స్‌కి 3-6 గంటల సూర్యరశ్మి అవసరం. వీటిని బాటిల్స్, గ్లాస్ కంటైనర్స్‌లో పెంచొచ్చు. సారవంతమైన మట్టి, మంచి విత్తనాలు వాడాలి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఆకుకూరలు, టొమాటో, మిర్చి, అల్లం, బంగాళదుంప ఈజీగా పెరుగుతాయి. సరిపడా నీరే పోయాలి. కుండీలకు రంధ్రాలు ఉండేలా చూసుకోవాలి. వీలైనంత వరకూ రసాయనాలు, పురుగుమందులు వాడకూడదు.
News February 4, 2026
బత్తాయిలో తొడిమ కుళ్లు తెగులును ఎలా నివారించాలి?

తొడిమ కుళ్లు సోకి, రాలిపోయిన కాయలను ఏరి నాశనం చేయాలి. తెగులు నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. లేదా కార్బండిజం 1 గ్రాము కలిపి పిచికారీ చేయాలి. ప్రతి సంవత్సరం తొలకరిలో చెట్లలో ఎండుపుల్లలను కత్తిరించి నాశనం చేయాలి. శిలీంధ్రానికి ఆశ్రయమిచ్చే కలుపు మొక్కలను సమర్థవంతంగా అరికట్టేందుకు చెట్ల పాదుల్లో మల్చింగ్ పద్ధతిని అవలంబించాలి. తోటల్లో నీటి ఎద్దడి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.


