News April 6, 2025

సీతారాముల కళ్యాణం.. పోటెత్తిన భక్తజనం

image

TG: భద్రాద్రి భక్తజనసంద్రమైంది. సీతారాముల కళ్యాణం తిలకించేందుకు భక్తులు పోటెత్తడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. కళ్యాణమూర్తులను ఊరేగింపుగా మిథిలా మండపానికి తీసుకెళ్తుండగా అడుగడుగునా నీరాజనాలు పలికారు. మధ్యాహ్నం 12గం.లకు రామయ్య, సీతమ్మల కళ్యాణం జరగనుంది. ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించేందుకు కాసేపట్లో CM రేవంత్‌రెడ్డి అక్కడికి చేరుకోనున్నారు. పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Similar News

News April 7, 2025

పీయూష్ వ్యాఖ్యలపై స్టార్టప్‌ ఫౌండర్ ఫైర్

image

స్టార్టప్‌ కంపెనీలపై <<15987267>>పీయూష్ గోయల్ వ్యాఖ్యలకు<<>> కొందరు మద్దతిస్తుండగా మరికొందరు విమర్శిస్తున్నారు. ఓ స్టార్టప్ ఫౌండర్ Xలో చేసిన పోస్ట్ వైరలవుతోంది. ‘నేను 100మందితో బుర్హాన్‌పూర్‌(MP)లో సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టాను. ఇక్కడ విద్యుత్ సమస్య, లంచాల కోసం అధికారుల వేధింపులు సాధారణం. ఈ సమస్యలపై PMO, IAS అధికారులకు లేఖలు రాసినా స్పందన లేదు. సౌకర్యాలు కల్పించకుండా ఇన్నోవేషన్ కావాలంటే ఎలా?’ అని ఫైర్ అయ్యారు.

News April 7, 2025

యాక్షన్ థ్రిల్లర్‌గా ‘స్పిరిట్’!

image

రెబల్ స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చే సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం మెక్సికోలో స్టార్ట్ చేయనున్నట్లు డైరెక్టర్ వెల్లడించారు. ‘స్పిరిట్ సినిమా ఆసక్తికరంగా, ఉత్కంఠ భరితంగా సాగే ప్రాజెక్టు’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దీంతో ఇది సాలిడ్ యాక్షన్‌తో కూడిన థ్రిల్లర్ టైప్ సినిమా అని తెలియడంతో అభిమానుల్లో మరిన్ని అంచనాలు పెరిగాయి.

News April 7, 2025

ట్రంప్ ఎఫెక్ట్.. నష్టాల్లో ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లు

image

యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన టారిఫ్స్‌ ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపిస్తోంది. ఆస్ట్రేలియా, జపాన్, చైనా, సింగపూర్, మలేషియా, తైవాన్ దేశాల స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. మరోవైపు జపాన్ కంపెనీ సోనీ షేర్లు ఏకంగా 10% పతనమయ్యాయి. ఇప్పటికే ట్రంప్ టారిఫ్స్‌ను చాలా దేశాలు వ్యతిరేకించాయి. సుంకాల తగ్గింపుపై అగ్రరాజ్యంతో పలు దేశాలు చర్చలకు దిగాయి.

error: Content is protected !!