News May 25, 2024

పీసీసీ చీఫ్‌గా సీతక్క?

image

TG: పీసీసీ చీఫ్‌గా మంత్రి సీతక్క ఎంపిక కానున్నట్లు తెలుస్తోంది. దాదాపు 10 మంది ఆ పదవిని ఆశిస్తుండగా.. ఆమె పేరే ఖరారు కానున్నట్లు సమాచారం. హైకమాండ్ ఖరారు చేసినా ఆదివాసీ, మహిళ కావడంతో పార్టీ నేతలు వ్యతిరేకించలేరని టాక్. కేబినెట్ విస్తరణ సమయంలోనే పీసీసీ చీఫ్ మార్పు ఉంటుందని తెలుస్తోంది. ఒక వేళ సీతక్కకు పీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగిస్తే.. మంత్రి పదవి నుంచి ఆమె తప్పుకోవాల్సి ఉంటుందని సమాచారం.

Similar News

News November 15, 2025

మల్లె తోటల్లో కొమ్మ కత్తిరింపుల తర్వాత నీటి తడులు – జాగ్రత్తలు

image

మల్లె మొక్క కొమ్మల కత్తిరింపు తర్వాత మొక్కకు నీటి అవసరం ఎక్కువగా ఉండదు. ఈ సమయంలో అధిక నీటిని అందిస్తే మొక్కల వేర్లు కుళ్లిపోయే అవకాశం ఉంది. అందుకే నేల మరీ తడిగా, నీరు నేలపై నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఒక వేలిని నేలలో 2-3 అంగుళాల లోతు వరకు పెట్టి నేల ఎండినట్లు అనిపిస్తేనే నీరు పోయాలి. మొక్క నుంచి కొత్త చిగురు, మొగ్గలు వచ్చే సమయంలో నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. ఈ దశలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి.

News November 15, 2025

115 పోస్టులకు BOI నోటిఫికేషన్

image

బ్యాంక్ ఆఫ్ ఇండియా(<>BOI<<>>) 115 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి బీటెక్, BE, MSc, MCA అర్హత గల అభ్యర్థులు ఈ నెల 17 నుంచి 30 వరకు అప్లై చేసుకోవచ్చు. నెలకు జీతం రూ.64,820 నుంచి రూ.1,20,940 వరకు చెల్లిస్తారు. ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.850, SC, ST, PWBDలకు రూ.175. వెబ్‌సైట్: https://bankofindia.bank.in/

News November 15, 2025

బ్యాంకుల విలీనం మంచిదే: SBI ఛైర్మన్

image

ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం మంచిదేనని SBI ఛైర్మన్ శ్రీనివాసులు శెట్టి అభిప్రాయపడ్డారు. ‘మరోసారి విలీనాలు జరిగినా ఆశ్చర్యం లేదు. ఇంకా కొన్ని చిన్న బ్యాంకులున్నాయి. అమెరికా విధించిన అదనపు టారిఫ్‌లతో మన దేశ ఎగుమతులపై ప్రభావం పడినప్పటికీ ఏ రంగం నుంచి SBIకి సమస్యలు ఎదురుకాలేదు. ఎక్స్‌పోర్ట్ చేసేవారికి సపోర్ట్ కొనసాగుతుంది. మార్కెట్ వాటా పొందే విషయంలో రాజీపడడం లేదు’ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.