News September 10, 2024
విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(72) ఆరోగ్యం విషమంగా ఉందని ఆ పార్టీ ప్రకటించింది. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడంతో ఆయన ఆగస్టు 19న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. పరిస్థితి విషమించడంతో ఆయనకు వైద్యులు ICUలో చికిత్స అందిస్తున్నారు. ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని ఇటీవల సీపీఎం ప్రకటించింది. తాజాగా మళ్లీ విషమంగా మారింది.
Similar News
News October 22, 2025
కుంకుమపువ్వుతో మహిళలకు ఎన్నో లాభాలు

కుంకుమపువ్వుతో మహిళలకు ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. హార్మోన్ల సమతుల్యతను కాపాడటంతో పాటు బీపీ, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడే క్రోసెటిన్, క్రోసిన్ కుంకుమపువ్వులో ఉంటాయంటున్నారు. రోగనిరోధకశక్తిని పెంచడంలో కూడా ఇది తోడ్పడుతుంది. పాలలో కలుపుకొని తాగటం లేదా కుంకుమ పువ్వు టీ చేసుకొని తాగడం మంచిదని సూచిస్తున్నారు.
News October 22, 2025
మహిళలకు నెలకు రూ.30 వేలు.. RJD కొత్త పథకం

బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీలు హామీలతో ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. ఇటీవల JDU-BJP ప్రభుత్వం స్వయం ఉపాధి కోసం మహిళల అకౌంట్లలో రూ.10 వేలు జమ చేయడం తెలిసిందే. తాజాగా RJD చీఫ్ తేజస్వీ యాదవ్ మహిళా సంఘాల సభ్యులను శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులను చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వస్తే ‘జీవికా CM’ స్కీం పేరిట ప్రతి నెల రూ.30,000 జీతం ఇస్తామన్నారు. లోన్లపై వడ్డీ మాఫీ చేస్తామని ప్రకటించారు.
News October 22, 2025
సినీ ముచ్చట్లు

*ప్రభాస్-హను రాఘవపూడి సినిమా థీమ్‌ను తెలుపుతూ కొత్త పోస్టర్ విడుదల. రేపు 11.07AMకు టైటిల్ పోస్టర్ రిలీజ్ చేస్తామని ప్రకటన
*నవంబర్ 14న ‘డ్యూడ్’ ఓటీటీ విడుదలకు నెట్‌ఫ్లిక్స్ ప్లాన్!
*త్రివిక్రమ్-విక్టరీ వెంకటేశ్ కొత్త సినిమాలో హీరోయిన్గా KGF బ్యూటీ శ్రీనిధి శెట్టి ఎంపిక
*ముంబైలో శిల్పాశెట్టి రెస్టారెంట్.. రోజుకు రూ.2-3 కోట్ల ఆదాయం!