News August 7, 2024

ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టు ప్రారంభం: ఉత్తమ్

image

TG: ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 15న CM రేవంత్ ప్రారంభించనున్నట్లు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం వైరాలో జరిగే సభలో సీఎం పాల్గొంటారు. భద్రాద్రి(D) దుమ్ముగూడెంలో ఈ ప్రాజెక్టును నిర్మించారు. 15న ప్రారంభం కానుండటంతో ఈ నెల 11న మంత్రి సమక్షంలో అధికారులు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు.

Similar News

News November 13, 2025

హైదరాబాద్ మెట్రో: 4, 6 కోచ్‌లతో రైళ్లు!

image

TG: హైదరాబాద్ మెట్రోలో రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో 4, 6 కోచ్‌ల రైళ్లను ప్రవేశపెట్టాలని HMRL యోచిస్తోంది. ఇందుకోసం 40-60 కోచ్‌లను తీసుకురానున్నట్లు HMRL ఎండీ సర్ఫరాజ్ తెలిపారు. ప్రస్తుతం 3 మార్గాల్లో 3 కోచ్‌లతో 56 రైళ్లు తిరుగుతున్నాయని పేర్కొన్నారు. వీటిలో ఎలాంటి మార్పులు చేయకుండా కొత్తగా 4, 6 కోచ్‌లతో ట్రైన్లను తీసుకొస్తామని వివరించారు. ఇందుకు రెండేళ్లకు పైగా సమయం పట్టొచ్చని చెప్పారు.

News November 13, 2025

ఒక్క జూమ్ కాల్‌తో ₹1.35లక్షల కోట్ల పెట్టుబడి: లోకేశ్

image

AP: ₹1.35లక్షల కోట్ల పెట్టుబడి పెట్టే ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌ను కేవలం జూమ్ కాల్‌తో రప్పించామని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. విశాఖలో 5 సంస్థలకు ఆయన భూమిపూజ చేశారు. గూగుల్ AI హబ్‌కు నెలాఖరున శంకుస్థాపన చేస్తామని తెలిపారు. TCS, కాగ్నిజెంట్ సహా అనేక ఐటీ జెయింట్స్ రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పారు. 2026 జూన్‌కు భోగాపురం ఎయిర్ పోర్టు నుంచి అంతర్జాతీయ కనెక్టివిటీ ప్రారంభమవుతుందని వివరించారు.

News November 13, 2025

SSC ఫీజు గడువు NOV 20 వరకు పొడిగింపు

image

TG: టెన్త్ పరీక్షల ఫీజు గడువును నవంబర్ 20 వరకు పొడిగిస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. నవంబర్ 21 నుంచి 29 వరకు ₹50, డిసెంబర్ 2 నుంచి 11 వరకు ₹200, 15 నుంచి 29 వరకు ₹500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించవచ్చని తెలిపింది. రెగ్యులర్, ఫెయిల్ అభ్యర్థులు 2026 మార్చిలో జరిగే ఈ పరీక్షలకు ఫీజు చెల్లించాలంది. గడువు లోపు రూ.125 ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.