News December 4, 2024

కుర్చీలో కూర్చుంటే అదే స్నానం చేయిస్తుంది!

image

స్నానం చేయడాన్ని బద్ధకంగా ఫీలయ్యే వారికి జపాన్ ఓ కొత్త ఆవిష్కరణ తెచ్చింది. ఆ దేశానికి చెందిన సైన్స్ కో సంస్థ ‘హ్యామన్ వాషింగ్ మెషీన్’ రూపొందించింది. AIతో పనిచేసే ఈ మెషీన్‌లోని కుర్చీలో కూర్చుంటే 15నిమిషాల్లో స్నానం చేయిస్తుంది. మనిషి శరీర ఉష్ణోగ్రతలకు అనుగుణంగా నీటిని విడుదల చేసి స్నానం చేయించడంతో పాటు ఆరబెడుతుంది. వచ్చే ఏడాది మెషీన్‌ను ప్రదర్శనకు ఉంచి, ఆపై అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశముంది.

Similar News

News December 16, 2025

అభివృద్ధి, ఆదాయం పెంపు దిశగా అడుగులు

image

TG: అభివృద్ధి, ఆదాయం పెంపు దిశగా అడుగులేసేందుకు ప్రతి 3నెలలకు GSDPని సమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఏడాది చివర్లో కానీ చేయడం లేదు. దీనివల్ల ఆదాయ వృద్ధి, లీకేజీల నివారణకు ఆస్కారం లేకపోతోంది. అటు కేంద్రం, AP త్రైమాసిక రివ్యూలతో ముందుకు వెళ్తున్నాయి. అదే మాదిరి ఇక్కడా అగ్రి, సర్వీస్, ప్రొడక్టివిటీ రంగాలపై సర్కారు దృష్టి పెట్టనుంది. తద్వారా మరింత వృద్ధి సాధ్యమని భావిస్తోంది.

News December 16, 2025

IPL-2026 అప్‌డేట్

image

IPL 2026 ప్రారంభ తేదీ మారింది. తొలి మ్యాచ్ మార్చి 26న జరగనుందని Cricbuzz వెల్లడించింది. మే 31న ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. కాగా ఇదివరకు మార్చి 15న ఐపీఎల్ ప్రారంభం అవుతుందని నిర్వాహకులు ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు రేపు అబుదాబిలో ఐపీఎల్ మినీ వేలం జరగనుంది.

News December 16, 2025

IPL ఆక్షన్.. వీరిపైనే ఫ్రాంఛైజీల ఫోకస్?

image

మరికొన్ని గంటల్లో IPL మినీ వేలం జరగనుంది. కొందరు ప్లేయర్ల కోసం తీవ్ర పోటీ ఉండే ఛాన్సుంది. ఈ లిస్టులో గ్రీన్(AUS), పతిరణ, హసరంగా(SL), రవి బిష్ణోయ్, V అయ్యర్(IND), మిల్లర్, డికాక్, నోర్జ్(SA), జేమీ స్మిత్, లివింగ్ స్టోన్(ENG) వంటి ఆటగాళ్లున్నారు. అటు గత వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిన IND బ్యాటర్లు పృథ్వీ షా, సర్ఫరాజ్ ఈసారి సోల్డ్ అవుతారా? వారిని ఏ టీమ్ తీసుకుంటుందనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.