News October 7, 2024

ఆ కుర్చీలో కూర్చుంటే మరణశాసనం రాసుకున్నట్టేనా!

image

హెజ్బొల్లా చీఫ్ హ‌స‌న్ న‌స్ర‌ల్లాను ఇజ్రాయెల్ హతమార్చడంతో ఆయ‌న వార‌స‌త్వాన్ని స్వీక‌రించ‌డానికి కీల‌క నేత‌లు జంకుతున్నారు. ఆ కుర్చీలో కూర్చోవ‌డ‌మంటే మ‌ర‌ణ‌శాస‌నాన్ని రాసుకున్న‌ట్టే అనే భావ‌న‌లో ఉన్నారు. ఈ కార‌ణంతో ఇరాన్ మ‌ద్ద‌తుగల ఈ సంస్థ ప‌గ్గాలు చేప‌ట్ట‌డానికి కీల‌క నేత ఇబ్ర‌హీం అమీన్ నిరాక‌రించారు. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో ఈ బాధ్య‌త‌లు ప్రమాదకరమని హెజ్బొల్లా నేతలకు అవగతమైనట్టు తెలుస్తోంది.

Similar News

News February 1, 2026

స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్.. విదేశీ విద్య, వైద్యం ఇక చౌక

image

విదేశాల్లో చదువుకునే విద్యార్థులు, అక్కడ వైద్యం చేయించుకునే వారికి కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. బడ్జెట్‌లో భాగంగా LRS కింద విదేశాలకు పంపే నగదుపై TCSను 5% నుంచి 2%కి తగ్గించారు. గ్లోబల్ ఖర్చులు పెరుగుతున్న వేళ ఈ నిర్ణయం మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించి నగదు లభ్యతను పెంచుతుంది. దివ్యాంగుల కోసం దివ్యాంజన్‌ కౌశల్‌ యోజన, దివ్యాంగ్‌ సహకార యోజన పథకాన్ని ప్రకటించారు.

News February 1, 2026

స్థానిక సంస్థలకు గ్రాంటుగా 1.40 లక్షల కోట్లు

image

దేశంలోని రూరల్, అర్బన్ లోకల్ బాడీలకు 2026-27 ఆర్థిక సంవత్సరంలో ₹1.40 లక్షల కోట్లను గ్రాంటుగా అందించాలని కేంద్రం బడ్జెట్లో ప్రతిపాదించింది. అలాగే 16వ ఆర్థిక సంఘం సిఫార్సులను కేంద్రం ఆమోదించింది. వివిధ పన్నుల నుంచి రాష్ట్రాల వాటాగా 41 శాతం నిధులను అందించనున్నట్లు ప్రకటించింది.

News February 1, 2026

బ్యాంకింగ్ రంగ పటిష్ఠానికి ఉన్నతస్థాయి కమిటీ

image

బ్యాంకింగ్ రంగాన్ని మరింత పటిష్ఠం చేసేలా ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేయనున్నట్లు కేంద్రం బడ్జెట్లో ప్రకటించింది. ‘ప్రస్తుతం దేశంలోని బ్యాంకులు హెల్తీ బ్యాలెన్స్ షీట్లు, లాభాలతో మెరుగ్గా ఉన్నాయి. మొండి రుణాలపై నియంత్రణతో ఉన్నాయి. మరింత మెరుగైన రీతిలో వీటిని పటిష్ఠం చేసేందుకు, సంస్కరణల అమలుకు వీలుగా ఉన్నతస్థాయి కమిటీ పనిచేస్తుంది. తదుపరి ఎకనమిక్ గ్రోత్ సాధనకు ఇది దోహదపడుతుంది’ అని వివరించారు.