News September 5, 2025

శివకార్తికేయన్ ‘మదరాసి’ రివ్యూ&రేటింగ్

image

తమిళనాడులోకి గన్ కల్చర్‌ రాకుండా అడ్డుకునేందుకు హీరో చేసే పోరాటమే ‘మదరాసి’. యాక్షన్ సీన్లు, హీరోయిన్‌తో శివకార్తికేయన్ కెమిస్ట్రీ బాగుంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నతంగా ఉన్నాయి. ఫస్టాఫ్ పర్వాలేదనిపించినా సెకండాఫ్‌లో డైరెక్టర్ మురగదాస్ దారి తప్పారు. కథను కొత్తగా చెప్పడంలో సక్సెస్ కాలేకపోయారు. ఊహించే సీన్లు, సాగదీత విసుగు తెప్పిస్తాయి. అనిరుధ్ మ్యూజిక్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.
రేటింగ్: 2.25/5

Similar News

News September 5, 2025

ప్రధాని మోదీకి డైరెక్టర్ నాగ్ అశ్విన్ రిక్వెస్ట్

image

సినిమా టికెట్లకు విధించే GSTపై ప్రధాని మోదీకి డైరెక్టర్ నాగ్ అశ్విన్ రిక్వెస్ట్ చేశారు. ‘జీఎస్టీ సంస్కరణలను స్వాగతిస్తున్నా. 5 శాతం జీఎస్టీని రూ.100 టికెట్లలోపు కాకుండా రూ.250 టికెట్లకు పెడితే మరింత మేలు జరుగుతుంది. ఇది మధ్య తరగతి ప్రజలు థియేటర్లకు వచ్చేందుకు ఎంతో సహకరిస్తుంది’ అని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా రూ.100 టికెట్లపై 12 శాతం GSTని తొలగించి 5 శాతం జీఎస్టీని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

News September 5, 2025

రష్యా ఆయిల్ కొనుగోలు చేస్తూనే ఉంటాం: నిర్మల

image

దేశ అవసరాలకు తగ్గట్టు రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేస్తూనే ఉంటుందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. భారత్ తన సొంత ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తుందని ఆమె స్పష్టం చేశారు. చమురును ఎక్కడి నుంచి కొనుగోలు చేయాలనే నిర్ణయం మనదే అని వివరించారు. అమెరికా అధిక టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో ఎగుమతిదారులకు ఉపశమనం కలిగేలా త్వరలో ప్యాకేజీ ప్రకటిస్తామని చెప్పారు.

News September 5, 2025

GST ఎఫెక్ట్.. టాటా కార్ల ధరలు తగ్గాయ్

image

GST తగ్గించిన నేపథ్యంలో SEP 22 నుంచి కార్ల ధరలను సవరిస్తున్నట్లు టాటా ప్రకటించింది. చిన్నకార్లపై రూ.75వేల వరకు, పెద్ద కార్లపై రూ.1.45లక్షల వరకు తగ్గింపు ఉండనుంది.
☛ చిన్నకార్లు: * టియాగో-రూ.75వేలు, * టిగోర్-రూ.80వేలు, * అల్ట్రోజ్-రూ.1.10లక్షలు
☛ కాంపాక్ట్ SUVలు: * పంచ్-రూ.85వేలు, * నెక్సాన్-రూ.1.55లక్షలు
☛ మిడ్ సైజ్ మోడల్: * కర్వ్-రూ.65వేలు
☛ SUVలు: * హారియర్-రూ.1.40లక్షలు, * సఫారీ-రూ.1.45లక్షలు