News July 4, 2024

హాథ్రస్ ఘటనలో ఆరుగురు అరెస్ట్

image

హాథ్రస్ ఘటనకు సంబంధించి పోలీసులు ఆరుగురు సత్సంగ్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. హాథ్రస్ జిల్లాలోని రతిభాన్‌పూర్‌లో నిర్వహించిన సత్సంగ్ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 121 మంది మరణించిన సంగతి తెలిసిందే. 80 వేల మందికి అనుమతి తీసుకోగా 2.50 లక్షల మందికిపైగా భక్తులు వచ్చారు. ఈ క్రమంలో బాబా పాద ధూళి కోసం జనం ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది.

Similar News

News March 17, 2026

పూజా సమయంలో ఏ రంగు దుస్తులు ధరించాలి?

image

పూజలో మనస్సును ప్రశాంతంగా ఉంచే సాత్విక రంగుల దుస్తులు ధరించడం శ్రేయస్కరం. సానుకూలతనిచ్చే పసుపు రంగు విష్ణుమూర్తికి ప్రీతికరం. తెలుపు పరిశుద్ధతకు, శాంతికి ప్రతీక. శివారాధనలో తెలుపు, శక్తి పూజల్లో ఎరుపు, గులాబీ ధరించడం ఉత్తమం. ఉదయం పూజకు పసుపు, తెలుపు రంగులు ఉత్తమం. అయితే, శని పూజలో మినహా నలుపు నిషిద్ధం. ముదురు నీలం రంగులను కూడా వాడకపోవడమే మంచిది. ఉతికిన శుభ్రమైన కాటన్ దుస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి.

News March 17, 2026

పాక్ మిలిటరీ హత్యలకు పాల్పడుతోంది: అఫ్గాన్ క్రికెటర్లు

image

తమ దేశంలోని ఆస్పత్రిపై పాకిస్థాన్ <<19403539>>వైమానిక దాడి<<>> చేయడాన్ని అఫ్గానిస్థాన్ క్రికెటర్లు ఖండించారు. రంజాన్ మాసంలో పాక్ మిలిటరీ హత్యలకు పాల్పడుతోందని రషీద్ ఖాన్, నబీ మండిపడ్డారు. ఆస్పత్రులు, స్కూళ్లు, గృహాలపై దాడి చేయడం వార్ క్రైమ్ అని పేర్కొన్నారు. ఈ ఘటనపై UN దర్యాప్తు చేసి నేరస్థులకు శిక్ష విధించాలని కోరారు. పాక్ దాడిలో దాదాపు 400 మంది మరణించారు.

News March 17, 2026

రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షోకాజ్ నోటీస్

image

TG: డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి పార్టీ చీఫ్ కేసీఆర్ ఆదేశాలతో BRS షోకాజ్ నోటీస్ ఇచ్చింది. తనపై వచ్చిన ఆరోపణలకు వారం రోజుల్లో లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని పేర్కొంది. లేదంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. పార్టీకి చెందినవారు అక్రమ కార్యకలాపాలు, డ్రగ్స్ వంటి వాటితో ఏ విధమైన సంబంధాలు కలిగి ఉండటాన్ని BRS పూర్తిగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేసింది.