News April 20, 2024
ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలు

పాకిస్థాన్‌లో అరుదైన సంఘటన జరిగింది. రావల్పిండికి చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో ఆరుగురు బిడ్డలకు జన్మనిచ్చింది. నవజాత శిశువుల్లో నలుగురు మగ, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. తల్లి, పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
Similar News
News March 17, 2026
‘లంచ్ బాక్స్ తెచ్చుకోండి’.. IT ఉద్యోగులకు గ్యాస్ కష్టాలు

దేశంలో నెలకొన్న LPG కొరత IT ఉద్యోగులను కష్టాలకు గురిచేస్తోంది. ఇన్ఫోసిస్, TCS, విప్రో, కాగ్నిజెంట్ వంటి సంస్థలు తమ క్యాంటీన్ సేవలను తగ్గించాయి. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఫుడ్ కౌంటర్లను మూసివేసి కేవలం లిమిటెడ్ మెనూని మాత్రమే అందిస్తున్నాయి. ఉద్యోగులు తమ భోజనాన్ని ఇళ్ల నుంచే తెచ్చుకోవాలని కంపెనీలు సూచించాయి. హాస్టళ్లు, PGల్లో ఉంటూ క్యాంటీన్ ఫుడ్‌పై ఆధారపడే టెకీలకు ఇది పెద్ద సమస్యగా మారింది.
News March 17, 2026
SGSW ఉద్యోగులు.. ఆలస్యమైతే లీవ్ కట్

AP: స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు (SGSW) ఉద్యోగుల హాజరు నిబంధనల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. 10.30amలోగా హాజరు నమోదు చేయాలని, 10min గ్రేస్ టైమ్ ఉంటుందని స్పష్టం చేసింది. 10.40am తర్వాత హాజరు నమోదైతే హాఫ్ డే సెలవుగా, 2.01pm-5pm మధ్య హాజరు నమోదైతే పూర్తి రోజు సెలవుగా పరిగణించనుంది. ఉద్యోగుల అటెండెన్స్ యాప్‌లో ఈ నిబంధనలు కనిపిస్తున్నాయి. DDO అనుమతితో నెలకు 3 రోజులు దీని నుంచి మినహాయింపు పొందొచ్చు.
News March 17, 2026
జగ్గారెడ్డి PCC చీఫ్ అయితే 100 సీట్లు గ్యారంటీ: కోమటిరెడ్డి

TG: PCC చీఫ్‌గా జగ్గారెడ్డిని నియమిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 100 సీట్లు గెలుచుకుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అసెంబ్లీ లాబీల్లో చిట్ చాట్‌గా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ‘జగ్గారెడ్డి మరొక PJR. ఆయన లాగే ప్రజా నాయకుడు. జగ్గారెడ్డి PCC చీఫ్‌గా ఉంటే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ 100 సీట్లలో గెలుస్తుంది. మహేశ్ గౌడ్‌ను తొలగించి జగ్గారెడ్డిని PCC చీఫ్‌గా చేయాలి’ అని సూచించారు.


