News October 9, 2024

‘దసరా’కి ఆరు సినిమాలు..

image

ఈ దసరాకు తెలుగులో ఆరు సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇందులో ముందుగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘వేట్టయన్’ ఈనెల 10న విడుదలవనుంది. 11వ తేదీన సుధీర్ బాబు ‘మా నాన్న సూపర్ హీరో’, గోపీచంద్ ‘విశ్వం’, ఆలియా భట్ ‘జిగ్రా’, ధ్రువ సర్జా ‘మార్టిన్’ రిలీజ్ కానున్నాయి. కాగా సుహాస్ ‘జనక అయితే గనక’ మూవీ ఈనెల 12న రానుంది. వీటిలో మీరు ఏ మూవీకి వెళ్లాలనుకుంటున్నారు? కామెంట్ చేయండి.

Similar News

News March 7, 2025

నేడు మంత్రివర్గ సమావేశం

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ మంత్రివర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలోని బ్లాక్-1లో ఈ భేటీ కొనసాగనుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన ముసాయిదా బిల్లులకు క్యాబినెట్ ఆమోదం పలకనున్నట్లు తెలుస్తోంది. అలాగే పలు కీలక అంశాలపై కూడా చర్చించే అవకాశమున్నట్లు సమాచారం.

News March 7, 2025

గాజా నుంచి పారిపోండి: హమాస్‌కు ట్రంప్ అల్టిమేటం

image

బందీలను విడిచిపెట్టి గాజా నుంచి పారిపోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్‌ను హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికగా హమాస్‌పై ట్రంప్ ధ్వజమెత్తారు. ‘మరణించినవారి మృతదేహాలను తక్షణమే అప్పగించండి. బందీలను విడుదల చేయండి. లేదంటే నరకం అనుభవిస్తారు. మిమ్మల్ని చంపడానికి ఇజ్రాయెల్‌కు అవసరమైనవన్నీ ఇస్తా. ఒక్క హమాస్ సభ్యుడు కూడా ప్రాణాలతో ఉండడు. తెలివైన నిర్ణయం తీసుకోండి’ అని ఫైర్ అయ్యారు.

News March 7, 2025

జియో హాట్‌స్టార్ విలీనం ఎఫెక్ట్..1,100 మందిపై వేటు

image

జియో హాట్‌స్టార్ సంస్థ 1,100 మంది ఉద్యోగులపై వేటు వేసింది. జూన్‌లోగా వీరందరినీ ఉద్యోగంలో నుంచి తొలగించనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. డిస్ట్రిబ్యూషన్, ఫైనాన్స్, కమర్షియల్, లీగల్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఉద్యోగులను ఎక్కువగా తొలగించింది. వీరందరికి 6 నుంచి 12 నెలల జీతం ఇచ్చి వదిలించుకోనుంది. కాగా విలీనం తర్వాత జియో హాట్‌స్టార్ విలువ రూ.70,352 కోట్లుగా ఉంటుందని అంచనా.

error: Content is protected !!