News April 10, 2024
ఎనిమిదేళ్లలో ఆరు రెట్లు పెరిగిన SIP పెట్టుబడులు

సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP) కింద మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు గత 8ఏళ్లలో ఆరు రెట్లు పెరిగాయి. SIP పెట్టుబడుల విలువ 2016 APRలో రూ.3,122 కోట్లు ఉంటే ఈ ఏడాది ఫిబ్రవరికి రూ.19,187 కోట్లకు చేరింది. 2015 మార్చిలో 73లక్షలుగా ఉన్న SIP అకౌంట్లు ఇప్పుడు 8.20కోట్లకు చేరినట్లు AMFI వెల్లడించింది. ‘మ్యూచువల్ ఫండ్స్ సహీ హై’ పేరుతో కేంద్రం చేసిన విస్తృత ప్రచారమే ఇందుకు కారణమంటున్నారు నిపుణులు.
Similar News
News December 2, 2025
DEC 9 అర్ధరాత్రి నుంచి రవాణా వాహనాల బంద్

రవాణా వాహనాలకు కేంద్రం ఫిట్నెస్ <<18321648>>ఛార్జీలు<<>> పెంచడంపై సౌత్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్(SIMTA) కీలక నిర్ణయం తీసుకుంది. DEC 9 అర్ధరాత్రి నుంచి రవాణా వాహనాల బంద్ పాటించనున్నట్లు ప్రకటించింది. AP, TN, TG, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరికి చెందిన 12 ఏళ్లు పైబడిన వాహన యజమానులు ఇందులో పాల్గొంటారని పేర్కొంది. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేవరకు బంద్ కొనసాగుతుందని తెలిపింది.
News December 2, 2025
రేపు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఆయన ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. పార్లమెంట్ భవనంలోనే పీఎంతో సమావేశమై తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించనున్నారు. అలాగే పలువురు కేంద్రమంత్రులను సైతం రేవంత్ కలిసి సదస్సుకు ఇన్వైట్ చేయనున్నారు.
News December 2, 2025
శ్రీలంకకు భారత్ సాయం.. కృతజ్ఞతలు చెప్పిన జయసూర్య

‘దిత్వా’ తుఫాను బీభత్సానికి తీవ్రంగా నష్టపోతున్న శ్రీలంకకు <<18427442>>భారత్ సాయం<<>> అందిస్తోంది. ఈ సందర్భంగా ఆ దేశ క్రికెట్ జట్టు కోచ్ సనత్ జయసూర్య భారత ప్రజలు, PM మోదీ, కేంద్ర మంత్రి జై శంకర్‌కు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారు. ‘క్లిష్ట సమయంలో SLకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు. ఆర్థిక సంక్షోభ సమయంలో ఆదుకున్నట్లుగానే ఇప్పుడూ మద్దతునిస్తున్నారు. ఇరుదేశాల మధ్య బలమైన స్నేహానికి ఇదే నిదర్శనం’ అని పేర్కొన్నారు.


