News July 12, 2024

ఆరడుగుల అబద్ధం చంద్రబాబు: పేర్ని నాని

image

AP: ప్రజలను మోసం చేసి కూటమి అధికారంలోకి వచ్చిందని వైసీపీ నేత పేర్ని నాని ఆరోపించారు. ఆరడుగుల అబద్ధానికి చంద్రబాబే నిదర్శనమని ఎద్దేవా చేశారు. ‘చంద్రబాబు ఇచ్చే ఉచిత ఇసుకలో ఉచితం ఉండదు. అమ్మకు వందనం అంటారు.. పిల్లలకు పంగనామం పెడతారు. హామీల అమలును మరిచి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. పోలవరాన్ని నాశనం చేసింది చంద్రబాబే. తప్పుడు లెక్కలతో ప్రజలను మభ్య పెడుతున్నారు’ అని ఆయన మండిపడ్డారు.

Similar News

News November 18, 2025

BELలో 52 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>) ఘజియాబాద్‌లో 52 ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. BE, B.Tech అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32ఏళ్లు. ఈ నెల 24న ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.472, SC,ST, PwBDలకు ఫీజు లేదు వెబ్‌సైట్: https://bel-india.in

10 రోజులు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ

image

తిరుమలలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని TTD తెలిపింది. నవంబర్ 27-డిసెంబర్ 1 వరకు ఆన్‌‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని, వీరికి మాత్రమే మొదటి 3 రోజులు దర్శనానికి అనుమతిస్తారని పేర్కొంది. తర్వాత 7రోజులు సర్వదర్శనం(ఉచితం) ఉంటుందని వెల్లడించింది. పది రోజుల్లో 182 గంటలు దర్శన సమయం ఉంటుందని, అందులో 164 గంటలు సామాన్య భక్తులకు అనుమతిస్తామని పేర్కొంది.