News June 23, 2024
ఇరాన్ అధ్యక్ష పదవి రేసులో ఆరుగురు

ఇరాన్ కొత్త అధ్యక్షుడు ఎవరో ఈనెల 30న తేలనుంది. ఈనెల 28న ఓటింగ్ జరగనుండగా, 30న ఫలితాలు వెల్లడి కానున్నాయి. అధ్యక్ష పదవి రేసులో ఆరుగురు అభ్యర్థులు నిలిచారు. పార్లమెంట్ స్పీకర్ జనరల్ మహమ్మద్ బఖర్ గలీబాఫ్, మాజీ చీఫ్ న్యూక్లియర్ నెగోషియేటర్ సయీద్ జలిలీ, మతాధికారి ముస్తాఫా పోర్ మొహమ్మదీ, దేశ ఉపాధ్యక్షుడు ఆమిర్ హోసేన్, టెహ్రాన్ మేయర్ అలీ రజా జకానీ, సంస్కరణల వాది మసూద్ పెజెష్కియాన్ పోటీలో ఉన్నారు.
Similar News
News November 7, 2025
యువత కోసం CMEGP పథకం!

AP: యువతకు స్వయం ఉపాధి, ఉద్యోగ కల్పనే లక్ష్యంగా CM ఉపాధి కల్పన (CMEGP) పథకాన్ని ప్రభుత్వం త్వరలో ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్కీమ్‌కి ఏటా రూ.300 కోట్లు ఖర్చు చేయనుంది. గ్రామీణ యువతకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. సేవారంగంలో రూ.2లక్షల-రూ.20 లక్షలు, తయారీ రంగంలో రూ.10 లక్షల-రూ.50 లక్షల వరకు రుణాలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారని, ఈనెల 10న క్యాబినెట్లో దీనిపై చర్చించనున్నట్లు సమాచారం.
News November 7, 2025
మంత్రాల వల్ల నిజంగానే ఫలితం ఉంటుందా?

మంత్రాల శక్తిని కొందరు నమ్మకపోయినా, అవి నిజంగానే సానుకూల ప్రభావాన్ని చూపుతాయని అనేక నివేదికలు తెలియజేస్తున్నాయి. మంత్రాలను పదే పదే జపించడం ధ్యానంలాగా పనిచేస్తుంది. ఈ ప్రక్రియలో మనస్సు మంత్రంపై కేంద్రీకృతమై ఏకాగ్రత పెరుగుతుంది. మంత్ర జపంతో ఉత్పన్నమయ్యే లయబద్ధ శబ్ద తరంగాలు మనలో మానసిక ప్రశాంతతను పెంచి, ఒత్తిడిని తగ్గిస్తాయి. ఫలితంగా మనలో సానుకూల శక్తి పెరిగి, జీవితం పట్ల మంచి దృక్పథం కలుగుతుంది.
News November 7, 2025
చరిత్ర సృష్టించిన శీతల్.. సాధారణ ఆర్చర్లతో పోటీ

పారా కాంపౌండ్ ఆర్చరీలో శీతల్ దేవి వరల్డ్ ఛాంపియన్‌గా నిలవడమే కాకుండా అనేక పతకాలు గెలిచారు. ఆమె ఇప్పుడు మరో అరుదైన ఘనత సాధించారు. సాధారణ ఆర్చర్లతో కలిసి ఆసియా కప్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించారు. జెడ్డా వేదికగా జరగనున్న ఆసియా కప్ స్టేజ్-3లో పోటీ పడే భారత జట్టుకు ఎంపికయ్యారు. సాధారణ ఆర్చర్ల జట్టులోకి పారా ఆర్చర్ ఎంపికవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం. ట్రయల్స్‌లో ఆమె ఓవరాల్‌గా 3వ స్థానంలో నిలిచారు.


