News July 6, 2024

రోడ్డు ప్రమాదాలు.. ఆరుగురు మృతి

image

AP: అన్నమయ్య జిల్లా రామాపురం(మ) కొండవాండ్లపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారును గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. అటు చిత్తూరు జిల్లా పెద్దపంజాణి(మ) బసవరాజు వద్ద అనంతపురం నుంచి తమిళనాడు వెళ్తున్న టూరిస్ట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన ఇద్దరు ప్రయాణికులు చనిపోయారు. 10 మందికి గాయాలయ్యాయి.

Similar News

News November 24, 2025

ఎక్సైజ్ అధికారుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస్

image

తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడిగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట సీఐ మిట్టపల్లి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సుల్తానాబాద్ ఎక్సైజ్ సీఐ కొంపెల్లి చిరంజీవి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. జిల్లాలోని వేములవాడ ఎక్సైజ్ సీఐ రాజశేఖర్ రావు ఉపాధ్యక్షుడిగా, ఎక్సైజ్ ఎస్సై వంగ రవి ప్రచార కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

News November 24, 2025

స్థానిక ఎన్నికల తేదీలపై 25న క్యాబినెట్ నిర్ణయం!

image

TG: కోర్టుల ఆదేశాల మేరకు పంచాయతీ ఎన్నికల్లో 50%లోపు రిజర్వేషన్లను ఖరారు చేశారు. పంచాయతీల రిజర్వేషన్లపై ఇవాళ కలెక్టర్లు గెజిట్‌ నోటిఫికేషన్లు జారీ చేస్తారు. కాగా హైకోర్టు ఉత్తర్వులను బట్టి షెడ్యూలు, నోటిఫికేషన్‌ విడుదలపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటికే మూడు దశల్లో నిర్వహణకు ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ నెల 25న జరిగే మంత్రివర్గ భేటీలో తేదీలు ఖరారయ్యే అవకాశం ఉంది.

News November 24, 2025

ఫ్లైట్‌లో ఈ 10 వస్తువులు నిషేధం అని తెలుసా?

image

విమాన ప్రయాణాలు చేసేవారు ఈ 10 వస్తువులను క్యారీ చేయకూడదు. కొబ్బరికాయ, కేన్డ్‌ ఫుడ్‌ను ఫ్లైట్‌లో తీసుకెళ్లకూడదు. అధిక పీడనం కారణంగా అవి పగిలిపోయే ప్రమాదం ఉంది. కొబ్బరి ముక్కలు, తురుము తీసుకెళ్లవచ్చు. సాఫ్ట్ చీజ్, విత్తనాలు, ప్రొటీన్ పౌడర్, దురియన్ ఫ్రూట్, నిషేధ రసాయనాలతో తయారు చేసిన మందులు, గ్లో స్టిక్స్, టాయ్ వెపన్స్, స్నో గ్లోబ్స్‌‌ను విమానాల్లో తీసుకెళ్లడంపై నిషేధం అమలులో ఉంది.