News October 7, 2024
ఆరో రోజు ‘అలిగిన బతుకమ్మ’

TG: బతుకమ్మ వేడుకల్లో ఆరో రోజును ‘అలిగిన బతుకమ్మ’గా పిలుస్తారు. పూర్వం బతుకమ్మను పేర్చే సమయంలో మాంసం తగిలి అపవిత్రం జరిగిందని ప్రచారంలో ఉంది. దీంతో ఇవాళ బతుకమ్మను తయారు చెయ్యరు. నైవేద్యం కూడా సమర్పించరు. అలక వీడాలని అమ్మవారిని మహిళలు ప్రార్థిస్తారు. అటు ఈరోజు దుర్గామాత శ్రీమహాచండీదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.
Similar News
News November 28, 2025
స్మృతితో పెళ్లిపై పలాశ్ తల్లి ఏమన్నారంటే..

స్మృతి మంధాన వివాహంపై సస్పెన్స్ కొనసాగుతున్న వేళ పలాశ్ ముచ్చల్ తల్లి అమృత స్పందించారు. త్వరలోనే పెళ్లి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఆ రోజు జరిగిన పరిణామాలపై ఇద్దరూ బాధపడుతున్నారు. మ్యారేజ్ అవగానే స్మృతికి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పడానికి ఏర్పాట్లు చేశాం. అనుకోని పరిస్థితులతో వివాహం వాయిదా వేశాం’ అని చెప్పారు. కాగా పెళ్లి సంబంధిత పోస్టులను స్మృతి డిలీట్ చేయడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.
News November 28, 2025
జపాన్ కామెంట్స్ ఎఫెక్ట్.. ఫ్రాన్స్ మద్దతుకు ప్రయత్నిస్తున్న చైనా

జపాన్‌తో వివాదం ముదురుతున్న వేళ ఫ్రాన్స్ మద్దతు కోసం చైనా ప్రయత్నిస్తోంది. ఇరు దేశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మద్దతుగా నిలబడాలని ఫ్రాన్స్ ప్రెసిడెంట్ దౌత్య సలహాదారుతో చైనా దౌత్యవేత్త వాంగ్ ఇ చెప్పారు. ‘వన్-చైనా’ విధానానికి ఫ్రాన్స్ సపోర్ట్ చేస్తుందని అనుకుంటున్నట్టు చెప్పారు. ఆర్థిక, వాణిజ్య అంశాలపై చర్చించడానికి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వచ్చే వారం చైనా వస్తున్నారు.
News November 28, 2025
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.710 పెరిగి రూ.1,28,460కు చేరింది. అలాగే 22 క్యారెట్ల పసిడి ధర రూ. 650 ఎగబాకి రూ.1,17,750 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.3,000 పెరిగి రూ.1,83,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


