News June 4, 2024

40 ఏళ్ల టీడీపీకి ఆరో గెలుపు

image

తెలుగోడి ఆత్మగౌరవ నినాదంతో 1982 మార్చి 29న ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆవిర్భవించిన 9 నెలలకే 1983 ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభంజనం సృష్టించింది. 1983, 85, 89, 94లలో శాసనసభకు ఎన్నికలు జరగ్గా NTR సారథ్యంలో టీడీపీ 3 సార్లు విజయం సాధించింది. 1994 తర్వాతి పరిణామాలతో చంద్రబాబు ఆ పార్టీ బాధ్యతలు చేపట్టి 1995లో సీఎం అయ్యారు. బాబు హయాంలో 1999, 2014, 2024 ఎన్నికల్లో టీడీపీ గెలుపొందింది.

Similar News

News November 29, 2024

నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ‘దీక్షా దివస్’

image

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ 15 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు ఆమరణ నిరాహారదీక్షకు శ్రీకారం చుట్టారు. ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ బీఆర్ఎస్ ఏటా నవంబర్ 29న దీక్షా దివస్ నిర్వహిస్తోంది. ఇవాళ అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనుంది. 2009, NOV 29 నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చే వరకూ 11 రోజులపాటు కేసీఆర్ దీక్షను కొనసాగించారు.

News November 29, 2024

టెన్త్ పరీక్ష ఫీజు గడువు పెంపు

image

TG: పదో తరగతి పరీక్ష ఫీజు గడువును డిసెంబర్ 5 వరకు పొడిగించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లింపునకు నిన్నటితోనే గడువు ముగియగా విద్యార్థులు, టీచర్ల నుంచి విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రూ.50 ఫైన్‌తో DEC 12, రూ.200 ఫైన్‌తో 19 వరకు, రూ.500 ఫైన్‌తో 30వరకు అవకాశం కల్పించినట్లు చెప్పారు.

News November 29, 2024

నేటి నుంచి U-19 ఆసియా కప్

image

నేటి నుంచి యూఏఈ వేదికగా అండర్-19 ఆసియా కప్ టోర్నీ జరగనుంది. మొత్తం 8 జట్లు రెండు గ్రూపులుగా పోటీ పడనున్నాయి. గ్రూప్-Aలో భారత్, జపాన్, పాకిస్థాన్, యూఏఈ, గ్రూప్-Bలో అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ ఉన్నాయి. ఇవాళ బంగ్లాదేశ్-అఫ్గానిస్థాన్, నేపాల్-శ్రీలంక మధ్య పోరు జరగనుంది. రేపు భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఉంది.