News July 22, 2024

ఆ సినిమా చూశాక ఆయనకు వీరాభిమాని అయ్యా: ఎస్.జే సూర్య

image

మలయాళం మూవీ ‘ఆవేశం’ చూశాక ఫహాద్ ఫాజిల్‌కు వీరాభిమాని అయినట్లు విలక్షణ నటుడు ఎస్.జే సూర్య అన్నారు. ‘రాయన్’ ప్రమోషన్స్‌లో ఆయన మాట్లాడారు. ఫహాద్‌తో కలిసి నటించే అవకాశం వచ్చిందని, ఆయనతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ధనుష్ ‘రాయన్’ సినిమాకు ఒక్కరోజులోనే డబ్బింగ్ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఈ మూవీ టీమ్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు.

Similar News

News February 4, 2026

NCERTలో 117 ఉద్యోగాలు

image

NCERT 117 అకడమిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో PG, M.LSc, NET/SET/SLET, PhD/M.Phil అర్హతతో పాటు అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.1000. ప్రొఫెసర్‌కు నెలకు రూ.1,44,200, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,31,400, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ లైబ్రేరియన్‌కు రూ.57,700 చెల్లిస్తారు. అర్హులు FEB 20 వరకు అప్లై చేయొచ్చు. మరిన్ని వివరాలకు www.ncert.nic.in చూడండి.

News February 4, 2026

క్రికెట్‌లో కొత్త రూల్స్: స్టంపింగ్‌లో బాల్ చేతికి తగిలితే సరిపోదు!

image

క్రికెట్ రూల్స్‌ను నిర్ణయించే MCC కొన్ని కీలక మార్పులు చేసింది. రనౌట్‌ లేదా స్టంపింగ్ చేసేటప్పుడు బాల్ కేవలం చేతికి తగిలితే సరిపోదు. దానిపై పూర్తి కంట్రోల్ ఉండాలి. టెస్ట్ క్రికెట్‌లో రోజు చివరి ఓవర్‌లో వికెట్ పడినా సరే ఆ ఓవర్ పూర్తి చేయాల్సిందే. అలాగే బౌలర్ రన్‌అప్ నుంచి కాకుండా బాల్ రిలీజయ్యాక కీపర్ గ్లోవ్స్ స్టంప్స్ వెనక ఉంటే సరిపోతుంది. ఈ మార్పులు అక్టోబర్ 2026 నుంచి అమల్లోకి రానున్నాయి.

News February 4, 2026

వాట్సాప్‌పై సుప్రీం ఆగ్రహం.. అసలు ఏం జరిగింది?

image

వాట్సాప్‌కు <<19037669>>సుప్రీంకోర్టు<<>> గట్టి వార్నింగ్ ఇచ్చింది. అసలు మ్యాటర్ ఏంటంటే.. 2021లో వాట్సాప్ తెచ్చిన ప్రైవసీ పాలసీ ప్రకారం యూజర్ల డేటాను మెటాలోని ఇతర కంపెనీలతో షేర్ చేసుకుంటామని చెప్పింది. దీనికి అంగీకరిస్తేనే వాట్సాప్ వాడుకోనిస్తాం, లేదంటే అకౌంట్ డిలీట్ చేసుకోండని కండిషన్ పెట్టింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు..‘భారత రాజ్యాంగాన్ని గౌరవించకపోతే దేశం విడిచి వెళ్లిపోండి’ అని హెచ్చరించింది.