News September 30, 2024
నేటి నుంచి నైపుణ్య గణన.. తొలుత మంగళగిరిలో

AP: నైపుణ్య గణన కార్యక్రమం పైలట్ ప్రాజెక్టుగా ఇవాళ మంగళగిరిలో ప్రారంభమవనుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రతి ఇంటికీ వెళ్లి యువతీయువకుల విద్యార్హతలు, ఉద్యోగ రంగం, నిరుద్యోగిత తదితర 25 రకాల ప్రశ్నలతో సమాచారం సేకరిస్తారు. క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలను సరిదిద్దుకున్న తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సర్వే మొదలవుతుంది. ఈ వివరాలతో యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణను ప్రభుత్వం ఇప్పిస్తుంది.
Similar News
News December 30, 2025
2026లో భారత్-పాక్ యుద్ధం.. US CFR జోస్యం

వచ్చే ఏడాదిలో భారత్-పాక్ మధ్య ఘర్షణలు మరింత పెరిగే అవకాశం ఉందని USకు చెందిన కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ (CFR) హెచ్చరించింది. పాక్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరగడంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు ఎక్కువయ్యే అవకాశం ఉందని పేర్కొంది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం జరిగిన ఆపరేషన్ సిందూర్ ఈ ఉద్రిక్తతలకు నేపథ్యమని తెలిపింది. ఇరు దేశాలు ఆయుధాల సమీకరణ వేగవంతం చేయడం ఆందోళన కలిగిస్తోందని వివరించింది.
News December 30, 2025
‘12 గ్రేప్స్ థియరీ’.. ఈ సెంటిమెంట్ గురించి తెలుసా?

కొత్త ఏడాది అంతా మంచి జరగాలని కోరుకుంటూ పాటించే సెంటిమెంట్లలో ‘12 గ్రేప్స్ థియరీ’ ఒకటి. స్పెయిన్ సంప్రదాయం ప్రకారం డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలకు నిమిషానికి ఒకటి చొప్పున 12 ద్రాక్ష పండ్లను తినాలి. ఒక్కో పండు ఏడాదిలోని ఒక్కో నెలకు సంకేతం. ఇలా తింటూ బలంగా సంకల్పించుకుంటే ఆ ఏడాదంతా అదృష్టం, ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయని చాలామంది నమ్ముతుంటారు. న్యూఇయర్ వేళ SMలో ఈ మేనిఫెస్టేషన్ ట్రెండ్ వైరలవుతోంది.
News December 30, 2025
గ్రూప్1: JAN 22న తీర్పు

తెలంగాణ గ్రూప్1 సెలక్షన్ లిస్టుపై హైకోర్టు JAN 22న తీర్పు ఇవ్వనుంది. లిస్టుపై కొందరు అభ్యర్థులు HCకి వెళ్లగా జాబితాను సింగిల్ బెంచ్ రద్దు చేసింది. దీనిపై TGPSC అప్పీల్‌కు వెళ్లడంతో, రద్దు తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది. తాజాగా CJ బెంచ్ ఇరు పక్షాల వాదనలు నమోదు చేసింది. తప్పుల తడకగా ఎగ్జామ్ జరిగిందని సెలక్ట్ కాని అభ్యర్థులు ఆరోపించగా, అంతా రూల్స్ ప్రకారమే జరిగిందని కమిషన్ వివరణ ఇచ్చింది.


