News August 23, 2025
సెప్టెంబర్‌లో నైపుణ్య పోర్టల్ ప్రారంభం: లోకేశ్

AP: సెప్టెంబర్‌లో నైపుణ్య పోర్టల్‌ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. దేశానికే రోల్ మోడల్‌గా నిలిచేలా దీన్ని తీర్చిదిద్దాలని అధికారులను ఆయన ఆదేశించారు. పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్‌తో ఈ పోర్టల్‌ను అనుసంధానించాలని సూచించారు. ఏటా 50వేల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేలా దీనిని తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News April 3, 2026
పోలింగ్ రోజు పెయిడ్ లీవ్.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం

పుదుచ్చేరి(Apr 9), తమిళనాడు(Apr 23) అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రాలకు చెందిన ఓటర్లకు AP ప్రభుత్వం ఊరటనిచ్చింది. సరిహద్దు జిల్లాలైన తిరుపతి, చిత్తూరు, కాకినాడ, కోనసీమల్లో పనిచేస్తున్న వారికి పోలింగ్ రోజున పెయిడ్ లీవ్ ఇవ్వాలని ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, షాపులు, పరిశ్రమల ఉద్యోగులు, రోజువారీ కూలీలు ఈ సదుపాయం పొందనున్నారు. వారంతా ఓటు వేసేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
News April 3, 2026
లక్ష్మీదేవికి ఇష్టం లేని, దారిద్ర్యం తెచ్చే పనులు

ఉదయాన్నే ఇల్లు, వాకిలి శుభ్రం చేయకపోవడం, సాయంత్రం సంధ్యా దీపం పెట్టకపోవడం, భోజనం చేసిన తర్వాత నోటిని శుభ్రం చేసుకోకపోవడం వంటి పనులు లక్ష్మీదేవికి ఇష్టం ఉండవని పండితులు చెబుతున్నారు. లేవగానే అరవడం, సరిగా వండని ఆహారాన్ని తినడం, తడిబట్టలతో భోజనం చేయడం, మంచం, కుర్చీలపై కూర్చొని భుజించడం కూడా అశుభం అంటున్నారు. ఇలాంటి పనులు ఇంటికి దారిద్ర్యాన్ని తెస్తాయని, అందుకే మానుకోవాలని సూచిస్తున్నారు.
News April 3, 2026
లక్ష్మీదేవి కటాక్షం కోసం నేడు ఏం చేయాలంటే..

లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శుక్రవారం నాడు ఉప్పు కొనాలని పండితులు చెబుతున్నారు. అలాగే పడుకునేటప్పుడు ఈశాన్యంలో దీపం వెలిగించడం, ఆవులకు నెయ్యి, బెల్లం కలిపిన ఆహారం లేదా గడ్డి తినిపించడం మంచిదని అంటున్నారు. ‘లక్ష్మీదేవికి పూలను సమర్పించాలి. వైవాహిక జీవితంలో ఆనందం కోసం గులాబీలు ఇవ్వాలి. సాయంత్రం పంచముఖి దీపం వెలిగించి, కర్పూరం హారతి బూడిదను పర్సులో ఉంచుకుంటే చేతిలో డబ్బు నిలుస్తుంది’ అని చెబుతున్నారు.


