News November 29, 2024

స్కిల్ స్కామ్: చంద్రబాబు బెయిల్ రద్దుపై విచారణ వాయిదా

image

AP: స్కిల్ స్కామ్ కేసులో CM చంద్రబాబు బెయిల్‌ను రద్దు చేయాలని గతంలో CID దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి వర్చువల్‌గా వాదనలు వినిపించారు. ఈ పిటిషన్‌పై తాము త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తాను ప్రస్తుతం ఢిల్లీలో లేనందున మరింత సమయం ఇవ్వాలని కోరారు. దీంతో జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారణను జనవరి రెండో వారానికి వాయిదా వేసింది.

Similar News

News March 22, 2026

కడప: MP మహేశ్‌కు మద్దతుగా బ్యానర్లు

image

కొద్దిరోజులుగా డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏలూరు MP పుట్టా మహేశ్ యాదవ్‌కి మద్దతుగా కడప జిల్లాలో పలుచోట్ల బ్యానర్లు వెలిశాయి. మైదుకూరు నియోజకవర్గం మొర్రాయిపల్లి రోడ్డులో న్యాయం నిలుస్తుంది, నిజాయితి గెలుస్తుంది.. వీ స్టాండ్ విత్ పుట్టా మహేశ్, ఇట్లు చాపాడు మండల ప్రజలు అనే వాక్యాలతో బ్యానర్‌లో రాసి ఉంది.

News March 22, 2026

ఈ జిల్లాల్లో వర్షాలు!

image

తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి, సూర్యాపేట, నల్గొండ, ములుగు జిల్లాల్లో ఇవాళ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. మిగతా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. Hydలో కూడా స్వల్పంగా వర్షం పడొచ్చని, ఎక్కువగా పొడి వాతావరణమే ఉంటుందని చెప్పింది. రేపటి నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వివరించింది.

News March 22, 2026

అన్నదాతలకు అన్నగా బాధ్యత తీసుకున్నా: CM రేవంత్

image

TG: రైతును ధైర్యంగా సాగు మడిలో నిలబెట్టేందుకు భరోసా ఇస్తున్నామని CM రేవంత్ తెలిపారు. అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యత తీసుకున్నానన్నారు. ‘70L మందికి ₹9,000Cr రైతు భరోసా నిధుల విడుదలకు నేడు శ్రీకారం చుడుతున్నాం. మా పాలనలో రైతే రాజు అని రుజువు చేస్తూ సిద్దిపేట(D) నర్మెట్ట గ్రామ వేదికగా పథకాన్ని అమలు చేస్తున్నాం. అక్కడ పామాయిల్ పరిశ్రమ, రిఫైనరీ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.