News July 29, 2024
స్మార్ట్‌ఫోన్ లైట్‌తో చర్మంపై ముడతలు

స్మార్ట్‌ఫోన్‌లు అతిగా వాడితే కళ్లు ఒత్తిడికి గురికావడం, నిద్రకు భంగం వాటిల్లడం వంటి పలు సమస్యలు వస్తాయని ఇప్పటికే పలు అధ్యయనాలు తేల్చాయి. అయితే ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీల నుంచి వెలువడే నీలి కాంతి వల్ల చర్మంపై ముడతలు వస్తాయని తాజాగా పరిశోధకులు తేల్చారు. నీలి కాంతి కొల్లాజెన్ ప్రొటీన్‌పై ప్రభావం చూపుతుందని, ఇది చర్మంపై ముడతలకు కారణమవుతుందని మిషిగన్ స్టేట్ వర్సిటీ పరిశోధకులు తెలిపారు.
Similar News
News March 31, 2026
ఆ దేశాలకు ట్రంప్ ఆప్షన్లు

హార్ముజ్‌లో నౌకల ప్రయాణానికి ఇబ్బంది లేకుండా చూస్తామని గతంలో పలు దేశాలకు హామీ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు మాట మార్చారు. ‘యుద్ధంలో పాల్గొనని UK లాంటి దేశాలకు రెండే ఆప్షన్లు ఉన్నాయి. మా దేశం నుంచి ఇంధనం కొనాలి. లేదంటే ధైర్యం తెచ్చుకొని సొంతంగా హార్ముజ్ నుంచి చమురు తెచ్చుకోవాలి. మీ కోసం మీరే పోరాడటం నేర్చుకోండి. అమెరికా మీకే సాయం చేయదు’ అని SMలో పోస్టు చేశారు.
News March 31, 2026
మొబైల్ డేటాను తెగ వాడేస్తున్నారు

గతేడాది దేశంలో ఒక్కో వ్యక్తి నెలవారీ సగటు మొబైల్ డేటా వినియోగం 31GBగా(2024లో 27.5GB) ఉందని నోకియా నివేదిక వెల్లడించింది. టోటల్ మంత్లీ డేటా వాడకం 27 ఎక్సాబైట్లు(ఒక ఎక్సాబైట్=100 కోట్ల GB) దాటిందని తెలిపింది. బ్రాడ్‌బ్యాండ్ ట్రాఫిక్‌లో 5G వాటా 47%గా ఉందంది. AI అప్లికేషన్స్, 4K వీడియోల స్ట్రీమింగ్, క్లౌడ్ గేమింగ్ కారణంగా డేటా వాడకం పెరిగిందని పేర్కొంది.
* మీరు డేటాను ఎక్కువగా దేనికోసం వాడుతున్నారు?
News March 31, 2026
అప్పటి నుంచి ధోనీతో మాట్లాడలేదు: జడేజా

CSK నుంచి రాజస్థాన్ జట్టులోకి ఛేంజ్ అయినప్పటి నుంచి ధోనీతో మాట్లాడలేదని జడేజా తెలిపారు. ‘ధోనీ ఫోన్ ఎప్పుడూ స్విచ్ఛాఫ్ చేసి ఉంచుతారు. అందుకే మాట్లాడలేదు’ అని నవ్వేశారు. నిన్న కలిసే అవకాశం రాలేదని, ఈసారి మీట్ అయినప్పుడు అన్ని విషయాలు చర్చించుకుంటామన్నారు. ఇక నిన్న మ్యాచ్ అనంతరం ఖలీల్ ధరించిన CSK జెర్సీని జడేజా కిస్ చేశారు. గత సీజన్ వరకు CSK జట్టులో జడ్డూ కీలక ప్లేయర్‌గా ఉన్న విషయం తెలిసిందే.


