News November 8, 2024
SKL: ఆర్టీసీ బస్సు కిందపడి మూడేళ్ల బాలుడి మృతి

శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన జరిగింది. కంచిలి మం. ముండల గ్రామంలో శుక్రవారం ఉదయం ఆర్టీసీ బస్సు వెనుక చక్రం కింద పడి మూడేళ్ల బాలుడు దివ్యాంశ్ ప్రధాన్ మృతి చెందాడు. కేబినౌగం నుంచి కంచిలి వస్తున్న ఆర్టీసీ బస్సు ముండల గ్రామాన్ని దాటుతున్న సమయంలో ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలుడు ప్రమాదవశాత్తు బస్సు కిందపడ్డాడు. బాలుడి తండ్రి ఉపాధి కోసం ఇతర దేశంలో ఉండగా తల్లి సంగీత ఇద్దరు పిల్లలతో ఇంటి వద్దనే ఉంటున్నారు.
Similar News
News October 25, 2025
శ్రీకాకుళం: టుడే టాప్ హెడ్ లైన్స్

◈శ్రీకాకుళం జిల్లాలో భక్తిశ్రద్ధలతో నాగులచవితి వేడుకలు
◈శ్రీకాకుళం: పీజీ ప్రవేశాల ప్రక్రియ పూర్తి అయ్యేదెన్నడు..?
◈టెక్కలి: జిల్లాలో రవాణాశాఖ అధికారుల విస్తృత తనిఖీలు
◈మందస: అగ్నిప్రమాదంలో నాలుగు పూరిల్లు దగ్దం
◈ఆదిత్యుని సేవలో హై కోర్టు జస్టిస్
◈టెక్కలి: పశువైద్య మందుల కొరత తీర్చండి
◈గార: నాగులచవితి వేడుకలకు ఆ గ్రామం దూరం
News October 25, 2025
శ్రీకాకుళం: పీజీ ప్రవేశాల ప్రక్రియ పూర్తయ్యేదెప్పుడో..?

పీజీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ పూర్తికి ఎదురుచూపులు తప్పడం లేదు. ఈఏడాది జూన్ 9-12 వరకు పీజీ సెట్ జరగగా..25న ఫలితాలొచ్చాయి. సెప్టెంబర్ 22న మొదట, అక్టోబర్ 12న రెండో కౌన్సిలింగ్ నిర్వహించినా.. ఇప్పటికీ స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తికాక విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. శ్రీకాకుళం జిల్లాలోని డా.బీ.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో ఈ ఏడాది కొన్ని కోర్సుల్లో జీరో అడ్మిషన్ల్ నమోదయ్యాయి.
News October 25, 2025
SKLM: ‘మొంథా’ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి

మొంథా’ తుపాను ముప్పు నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఇన్ఛార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ తుపాను జిల్లాపై అక్టోబర్ 28, 29 తేదీల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని వాతావరణ కేంద్రం హెచ్చరించిందని, జిల్లాలోని ఆయా శాఖల ఉన్నతాధికారులతో నేడు టెలి కాన్ఫరెన్స్లో మాట్లాడారు. అత్యవసర సమయాల్లో 08942-240557 నంబరుతో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు.


