News November 8, 2024
SKL: ఆర్టీసీ బస్సు కిందపడి మూడేళ్ల బాలుడి మృతి
శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన జరిగింది. కంచిలి మం. ముండల గ్రామంలో శుక్రవారం ఉదయం ఆర్టీసీ బస్సు వెనుక చక్రం కింద పడి మూడేళ్ల బాలుడు దివ్యాంశ్ ప్రధాన్ మృతి చెందాడు. కేబినౌగం నుంచి కంచిలి వస్తున్న ఆర్టీసీ బస్సు ముండల గ్రామాన్ని దాటుతున్న సమయంలో ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలుడు ప్రమాదవశాత్తు బస్సు కిందపడ్డాడు. బాలుడి తండ్రి ఉపాధి కోసం ఇతర దేశంలో ఉండగా తల్లి సంగీత ఇద్దరు పిల్లలతో ఇంటి వద్దనే ఉంటున్నారు.
Similar News
News December 11, 2024
శ్రీకాకుళం జిల్లా పేరు మార్పుపై మీరేమంటారు..?
శ్రీకాకుళం జిల్లాకు సర్దార్ గౌతు లచ్చన పేరు పెట్టాలని ఆయన అభిమానులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రజాకవి, ఫ్రీడం ఫైటర్ గరిమెళ్ల సత్యనారాయణ పేరు తెరపైకి వచ్చింది. నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో సిక్కోలుకు గరిమెళ్ల పేరు పెట్టాలని అరసం జిల్లా అధ్యక్షుడు నల్లి ధర్మరావు కోరారు. మరి ఎవరి పేరు అయితే జిల్లాకు పెట్టాలని మీరు కోరుకుంటున్నారో కామెంట్ చేయండి.
News December 11, 2024
మందస: తల్లిదండ్రులు మందలించారని సూసైడ్
క్షణికావేశంలో ఓ యువకుడు నిండు జీవితాన్ని పోగొట్టుకున్నాడు. మందసకు చెందిన బెహరా రామకృష్ణ(33) సోమవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. దీంతో కుటుంబ సభ్యులు మందలించారు. అనంతరం గ్రామ సమీపంలో ఇటుకలు బట్టికి వెళ్లి పూరిపాకలో ఉరేసుకున్నాడు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. తండ్రి బెహరా శ్యామ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
News December 11, 2024
శ్రీకాకుళం: ఓబీసీ ప్రక్రియను వేగవంతం చేయాలి
సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర లోని తూర్పుకాపు, కళింగవైశ్య, శిష్ఠకరణ, సొండి, అరవ కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కోరారు. దీనిపై గత 10 ఏళ్లుగా పార్లమెంటులో, ఎన్సీబీసీ కమిషన్‌లో పోరాడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. పలు కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాల్సిన ఆవశ్యకతను ఆయనకు వివరించారు. ఈ సమావేశంలో ఆయనతో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఉన్నారు.