News November 8, 2024
SKL: ఆర్టీసీ బస్సు కిందపడి మూడేళ్ల బాలుడి మృతి
శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన జరిగింది. కంచిలి మం. ముండల గ్రామంలో శుక్రవారం ఉదయం ఆర్టీసీ బస్సు వెనుక చక్రం కింద పడి మూడేళ్ల బాలుడు దివ్యాంశ్ ప్రధాన్ మృతి చెందాడు. కేబినౌగం నుంచి కంచిలి వస్తున్న ఆర్టీసీ బస్సు ముండల గ్రామాన్ని దాటుతున్న సమయంలో ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలుడు ప్రమాదవశాత్తు బస్సు కిందపడ్డాడు. బాలుడి తండ్రి ఉపాధి కోసం ఇతర దేశంలో ఉండగా తల్లి సంగీత ఇద్దరు పిల్లలతో ఇంటి వద్దనే ఉంటున్నారు.
Similar News
News November 23, 2024
శ్రీకాకుళం: ‘రూ.20 లక్షలతో బిజినెస్ పెట్టండి’
శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాలలో అగ్రి క్లినిక్స్ & అగ్రి బిజినెస్ సెంటర్స్ (ACABC) స్కీమ్‌పై నాబార్డ్ జిల్లాస్థాయి వర్క్‌షాప్ శుక్రవారం జరిగింది. నాబార్డ్ డీడీఎం రమేశ్ కృష్ణ మాట్లాడుతూ.. అగ్రి గ్రాడ్యూయేట్లు ఈ పథకం ద్వారా రూ.20 లక్షలతో బిజినెస్ చేస్తే రూ.8.8 లక్షల వరకు సబ్సిడీ వస్తుందని తెలిపారు. అసోసియేట్ డీన్ డాక్టర్ లక్ష్మి, అసిస్టెంట్ లీడ్ బ్యాంక్ మేనేజర్ పాల్గొన్నారు.
News November 23, 2024
IESలో సిక్కోలు వాసికి మూడో ర్యాంక్
ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్(IES) పరీక్షలో సిక్కోలు జిల్లా వాసి సత్తాచాటారు. పోలాకి మండలం జిల్లేడు మాకివలసకు గొల్లంగి సతీశ్ పరీక్ష రాయగా శుక్రవారం ఫలితాలు విడుదలయ్యాయి. ఆయన మూడో ర్యాంక్ సాధించారు. ఇదే పరీక్షల్లో గతేడాది 15వ ర్యాంకు వచ్చింది. నిరుపేద కుటుంబానికి చెందిన తన తల్లి నిర్మలమ్మ అండగా నిలవడంతో ఈ విజయం సాధించానని ఆయన తెలిపారు.
News November 23, 2024
SKLM: ముగిసిన B.Ed సెమిస్టర్ పరీక్షలు
శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో B.Ed 2వ సెమిస్టర్ పరీక్షలు శుక్రవారంతో ప్రశాంతంగా ముగిశాయి. ఈ పరీక్షలు ఈనెల 19వ తేదీన ప్రారంభమయ్యాయి. మొత్తం జిల్లాలో 8 పరీక్ష కేంద్రాల్లో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పరీక్షలు నిర్వహించారు. జిల్లా పరిధిలోని B.Ed కళాశాలల నుంచి 901 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.