News December 3, 2024
SKLM: అధైర్యం వద్దు.. అండగా ఉంటాం: మంత్రి
పొట్ట కూటి కోసం విదేశాలకు వెళ్లి, యాజమాన్యాల చిక్కుకున్న వలస కార్మికులకు అండగా ఉంటామని మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు భరోసా కల్పించారు. బాధితులందరినీ స్వదేశానికి తీసుకు వచ్చేలా కేంద్ర విదేశాంగ శాఖపై ఒత్తిడి తీసుకు వస్తానని హామీ ఇచ్చారు. ఇచ్ఛాపురం, కంచిలి, సోంపేట, వజ్రపుకొత్తూరు, నందిగాం, ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన దాదాపు 30 మంది సౌదీ వలస వెళ్లి చిక్కుకున్న విషయం తెలిసిందే.
Similar News
News December 27, 2024
రేపు అంబేడ్కర్ యూనివర్సిటీ సెలవు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలుపుతూ శనివారం ఎచ్చర్ల డా.బీ.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి సెలవును ప్రకటిస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ మేరకు యూనివర్సిటీ అధికారులు వివరాలు వెల్లడించారు. విశ్వవిద్యాలయంతో పాటు యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలలకు కూడా సంతాప దినంగా శనివారం సెలవును ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు.
News December 27, 2024
SKLM: నెమలి పింఛంపై కనకమహాలక్ష్మి దేవి చిత్రం
శ్రీకాకుళం నగరానికి చెందిన వాడాడ రాహుల్ పట్నాయక్ శుక్రవారం నెమలి పింఛంపై వేసిన కనకమహాలక్ష్మీ దేవి చిత్రం ఆకట్టుకుంది. రాహుల్ ఇటీవల జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో చిత్రాలకు ఎన్నో పురస్కారాలు పొందారు. పక్షుల వెంట్రుకలపై శ్రీనివాస కల్యాణం, శ్రీరామ పట్టాభిషేకం, శ్రీకృష్ణ రాసలీల తదితర దేవతల చిత్రాలు వేశారు. పాఠశాలల గోడలపై ఎన్నో విద్యా సంబంధిత బొమ్మలు వేసి పలువురు ప్రశంసలు పొందారు.
News December 27, 2024
SKLM: మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించాలి
మానవ అక్రమ రవాణా ఎంతగానో వేధిస్తుంది దీని ద్వారా ఎంతోమంది అమాయకుల జీవితాలు బలి అవుతున్నాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్. సన్యాసినాయుడు అన్నారు. శుక్రవారం న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో వీధి బాలల భిక్షాటన, మానవ అక్రమ రవాణా, పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులపై చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్, మహిళా పోలీసులతో సమీక్ష నిర్వహించారు.