News December 3, 2024
SKLM: అధైర్యం వద్దు.. అండగా ఉంటాం: మంత్రి

పొట్ట కూటి కోసం విదేశాలకు వెళ్లి, యాజమాన్యాల చిక్కుకున్న వలస కార్మికులకు అండగా ఉంటామని మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు భరోసా కల్పించారు. బాధితులందరినీ స్వదేశానికి తీసుకు వచ్చేలా కేంద్ర విదేశాంగ శాఖపై ఒత్తిడి తీసుకు వస్తానని హామీ ఇచ్చారు. ఇచ్ఛాపురం, కంచిలి, సోంపేట, వజ్రపుకొత్తూరు, నందిగాం, ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన దాదాపు 30 మంది సౌదీ వలస వెళ్లి చిక్కుకున్న విషయం తెలిసిందే.
Similar News
News February 9, 2026
SKLM: వరుస దొంగతనాలు.. ప్రజల హడల్

మందసలోని బాలిగాం గ్రామంలో వరుస దొంగతనాలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. కిల్లి శారదమ్మ ఇంట్లో తులమున్నర బంగారం, వల్లభ భూదేవి ఇంట్లో ఆరు తులాల వెండి పట్టుకొని పోయారు. దాంతో పాటు మార్పు భుజంగరావు ఇంట్లో బీరువాలను తెరిచి చిందర వందరగా పడేశారు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కపడ్డ గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాశీబుగ్గ రూరల్ సీఐ తిరుపతిరావు, మందస ఎస్ఐ కృష్ణప్రసాద్ వివరాలు సేకరించారు.
News February 9, 2026
శ్రీకాకుళం: టెన్త్ విద్యార్థులకు గమనిక

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరగనున్న విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం జరగనున్న ఎగ్జామ్స్‌లో ఓ పరీక్ష తేదీని మార్చినట్లు డీఈవో రవి కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మార్చి 20న జరగాల్సిన ఇంగ్లిషు పరీక్ష, ఆ రోజు రంజాన్ కావడంతో మరుసటి రోజు 21న నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ మార్పును టీచర్లు, విద్యార్థులు గమనించాలన్నారు.
News February 9, 2026
ఈనెల 11న టెక్కలిలో మెగా జాబ్ మేళా

టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 11న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సాయిబాబు తెలిపారు. ఈ ప్రాంగణ ఎంపికల్లో 12 ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. పదో తరగతి నుంచి పీజీ వరకు విద్యార్హత కలిగి, 18-35 ఏళ్లలోపు వయసున్న యువతీయువకులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు తమ ధ్రువపత్రాలతో హాజరుకావాలని ఆయన సూచించారు.


