News September 14, 2024
SKLM: అన్నదాతలకు యూరియా కరవు..!

జిల్లాలో 3,41,775 ఎకరాల్లో వరి సాగు చేశారు. రైతుభరోసా కేంద్రాల్లో యూరియా, కాంప్లెక్స్ ఎరువులు సుమారు 25,155 మెట్రిక్ టన్నులు పంపిణీ చేశారు. వీటిలో యూరియా కేవలం 17వేల మెట్రిక్ టన్నులు మాత్రమే. ఎకరా వరి సాగుకు మూడు విడతల్లో 50 కేజీల వరకూ యూరియా వినియోగిస్తారు. ఈ లెక్కన జిల్లాలో సాగుకు సంబంధించి 35వేల మెట్రిక్ టన్నుల వరకూ యూరియా అవసరం కాగా రైతుభరోసా కేంద్రాల్లో అరకొరగానే పంపిణీ చేస్తున్నారు.
Similar News
News December 1, 2025
ధాన్యం రవాణాకు జీపీఎస్ వాహనం తప్పనిసరి: శ్రీకాకుళం కలెక్టర్

ఖరీఫ్ 2025-26 సీజన్‌కు సంబంధించి జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రతి రైతు భరోసా కేంద్రాన్ని (ఆర్ఎస్కే) ధాన్యం కొనుగోలు కేంద్రంగా గుర్తించి, ప్రభుత్వం ద్వారా నేరుగా ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ధాన్యం రవాణాకు జీపీఎస్ వాహనం తప్పనిసరి చేయాలని అధికారులను ఆదేశించారు.
News December 1, 2025
శ్రీకాకుళం: డయేరియాపై మంత్రి అచ్చెన్న ఆరా.!

సంతబొమ్మాళి మండలం తాళ్లవలస గ్రామంలో డయేరియాతో ఒకరు మృతి చెందడం, పలువురు వ్యాధి భారిన పడిన సంఘటనపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం ఆరా తీశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారితో మాట్లాడి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. వైద్య బృందాలను పంపించి వైద్య శిబిరం ఏర్పాటు చేసి, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
News December 1, 2025
శ్రీకాకుళం: కేంద్ర మంత్రి వర్యా ఆశలన్నీ మీపైనే..!

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపై జిల్లా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు తద్వారా జిల్లా రైల్వేస్టేషన్లు అభివృద్ధి, పర్లాఖిమిడి-పలాస, కటక్ నూతన రైల్వే లైన్లు, మూలపేట-భోగాపురం కోస్టల్ కారిడార్ రహదారి నిర్మాణం, జిల్లాలో ప్రత్యేక ITDA ఏర్పాటు తదితర అంశాలు ప్రస్తావించాలని ప్రజలు కోరుతున్నారు.


