News April 16, 2025

SKLM: అశ్లీల స్ట్రీమింగ్ ముఠా అరెస్ట్

image

నిషేధిత వెబ్‌సైట్‌లపై లైవ్ న్యూడ్ వీడియోలు ప్రసారం చేస్తున్న సిక్కోలుకు చెందిన ఇద్దరిని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు ఐజీ రవికృష్ణ తెలిపిన వివరాల మేరకు.. శ్రీకాకుళం, గుంతకల్లుకు చెందిన ముగ్గురు నిందితులు గణేశ్, జ్యోత్స్న, లౌయిస్ అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు 3 కేసులు నమోదు చేశారు. ముఠా మరెంత మంది బాధితులను టార్గెట్ చేసిందన్న విషయంపై విచారణ సాగుతోంది.

Similar News

News November 14, 2025

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్

image

➤జిల్లాలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
➤ వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా అవగాహన కార్యక్రమాలు
➤ కొత్తమ్మతల్లి ఆలయంలో మహా మృత్యుంజయ యాగం
➤టెక్కలిలో ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం
➤SKLM: గ్రంథాలయాలు పాఠకులకు నేస్తాలు
➤మందసలో రాష్ట్రస్థాయి టెన్నికాయిట్ పోటీలు
➤నరసన్నపేట: నో స్మోకింగ్ జోన్‌లుగా పాఠశాల ప్రాంగణాలు

News November 14, 2025

SKLM: ‘బాలలు చెడి వ్యసనాలకు బానిస కావద్దు’

image

బాలలు చెడు వ్యసనాలకు బానిస కావద్దని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ప్రధాన కార్యదర్శి హరిబాబు పేర్కొన్నారు. శ్రీకాకుళం ఉమెన్స్ కాలేజీ గ్రౌండ్ ఆడిటోరియంలో బాలలదినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. విద్యను చక్కగా అభ్యసించి దేశానికి ఉపయోగపడే భావిపౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. సెల్ ఫోన్లకు దూరంగా ఉండి ఉన్నత ఆశయాలతో మంచి ఉద్యోగాలు సంపాదించాలన్నారు. DSP వివేకానంద, ప్రిన్సిపల్ కృష్ణవేణి, అధికారులు ఉన్నారు.

News November 14, 2025

నౌకా నిర్మాణ హబ్‌‌గా విశాఖ-శ్రీకాకుళం కారిడార్‌: CM

image

విశాఖలో గురువారం జరిగిన సీఐఐ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌–2025లో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. విశాఖ-శ్రీకాకుళం కారిడార్‌ను నౌకా నిర్మాణ హబ్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. భోగాపురం విమానాశ్రయం పరిధిలో ఏరో సిటీని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. 9 జిల్లాలతో కూడిన విశాఖ ఎకనామిక్ రీజియన్ అథారిటీకి ఛైర్మన్ హోదాలో తానే స్వయంగా పర్యవేక్షిస్తానని సీఎం పేర్కొన్నారు.