News February 19, 2025

SKLM: ‘ఆవుపాలు ధర పెంచాలి’

image

తగ్గించిన ఆవుపాలు ధర పెంచాలని.. కనీస వెన్న శాతాన్ని 2.8 శాతం నుంచి 3.1 శాతానికి పెంచడాన్ని వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మర్రాపు సూర్య నారాయణ డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని రైతు సంఘ కార్యాలయంలో బుధవారం పాల రైతులతో సమావేశం జరిగింది. 30 లీటర్ల కంటే తక్కువ పాలు పోసిన సెంటర్లను ఆపే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.

Similar News

News October 21, 2025

డీజే ఓ నిశ్శబ్ద హంతకి

image

పట్టణం, పల్లెలో డీజే శబ్దాలు హోరెత్తిస్తున్నాయి. శబ్ద తీవ్రత 50 డేసిబెల్స్ దాటితే మానవులకు గుండె సంబంధిత జబ్బులు, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నియమాలను నిర్వాహకులు పెడచెవిన పెట్టి పెద్ద శబ్దాలకు 100 డేసిబెల్స్‌ పెంచి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ నెల16న నరసన్నపేటలోని <<18018296>>భవానిపురంలో<<>> గౌరమ్మ ఊరేగింపులో డీజే శబ్దానికి భవనం కూలి పలువురు గాయపడిన సంగతి తెలిసిందే.

News October 21, 2025

శ్రీకాకుళం: అతని నేత్రాలు సజీవం

image

శ్రీకాకుళం నగరానికి చెందిన కే.కే. వి పురుషోత్తమరావు (కళ్యాణ్) మంగళవారం మృతి చెందారు. అతని నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకుని రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ జగన్మోహన్ రావుకు తెలియజేశారు. మగటపల్లి కళ్యాణి నేత్ర సేకరణ కేంద్రం ద్వారా ఆయన నేత్రాలను సేకరించి విశాఖపట్నంలో ఉన్న ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్‌కి అందజేశారు.

News October 21, 2025

శ్రీకాకుళం జిల్లాలోని ముఖ్య శైవ క్షేత్రాలు..!

image

రేపటి నుంచి కార్తీక మాసం మొదలుకానుంది. దీంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన శైవ క్షేత్రాలు ముస్తాబు కానున్నాయి. ముఖ్యంగా శ్రీముఖలింగేశ్వర దేవాలయం (జలుమూరు),
శ్రీ ఉత్తరేశ్వర స్వామి దేవాలయం (బలగ),
సంఘమేశ్వర ఆలయం(ఆమదాలవలస),
కోటేశ్వరస్వామి ఆలయం(శ్రీకాకుళం),
ఎండల మల్లికార్జున ఆలయం (రావివలస) క్షేత్రాలకు భక్తుల తాకిడి ఉండనుంది.