News February 19, 2025
SKLM: ‘ఆవుపాలు ధర పెంచాలి’

తగ్గించిన ఆవుపాలు ధర పెంచాలని.. కనీస వెన్న శాతాన్ని 2.8 శాతం నుంచి 3.1 శాతానికి పెంచడాన్ని వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మర్రాపు సూర్య నారాయణ డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని రైతు సంఘ కార్యాలయంలో బుధవారం పాల రైతులతో సమావేశం జరిగింది. 30 లీటర్ల కంటే తక్కువ పాలు పోసిన సెంటర్లను ఆపే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.
Similar News
News March 25, 2025
SKLM: కరెంట్ షాక్‌తో అటెండర్ మృతి

శ్రీకాకుళం జడ్పీ కార్యాలయం వెనుక ఉన్న గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్) పర్యవేక్షక ఇంజినీరు కార్యాలయం అటెండర్ మల్లారెడ్డి ఆనందరావు (46) మంగళవారం విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. కార్యాలయం ఆవరణలో మోటారు వేసేందుకు వెళ్లిన ఆయన షార్ట్ సర్క్యూట్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సిబ్బంది ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు.
News March 25, 2025
ఉద్దానంలో ఆకట్టుకున్న ‘ప్రేమ’ పనసకాయ

వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం ఉద్దానం గ్రామంలో ఒక పనసచెట్టుకు కాచిన పనసకాయ LOVE ఆకారంలో ఉండటం చూపరులను ఆకట్టుకుంటుంది. గ్రామానికి చెందిన ఒక రైతుకు చెందిన చెట్టుకు ఈ అరుదైన కాయ కాసింది. కాగా ప్రస్తుతం ఈ ఫొటోను గ్రామస్థులు, యువత సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉద్దానంలో ప్రేమ పనస అంటూ ఫొటోను SHARE చేస్తున్నారు.
News March 25, 2025
శ్రీకాకుళం: అనుమానంతోనే హత్యలు

నందిగాం మండలం కొత్త వీధికి చెందిన పిల్లా శివకుమార్ తూ.గో జిల్లా హుకుంపేటలో ఆదివారం తల్లి కూతుళ్లను హత్య చేసిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. మృతురాలు సానియా, శివకుమార్‌కు ఓ ఈవెంట్లో పరిచయం ఏర్పడింది. నిందితుడు ఆమె ఫోన్‌లో మరొకరితో చాటింగ్ చేయడాన్ని చూసి సహించని శివకుమార్.. పథకం ప్రకారం ఆ యువతితో పాటు తల్లిని కూడా హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. కోర్టు నిందితుడికి రిమాండ్ విధించింది.