News February 20, 2025
SKLM: ఆశా వర్కర్ల శిక్షణాసదస్సు పూర్తి

శ్రీకాకుళం జిల్లా DM&HO కార్యాలయంలో ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్(IGD) ఆధ్వర్యంలో అయోడిన్ లోపంపై ఆశావర్కర్లతో జరుగుతున్న రెండు రోజుల శిక్షణా కార్యక్రమం గురువారంతో ముగిసింది. ఆశా వర్కర్లకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ టీవీ బాలమురళీకృష్ణ ప్రశంసా పత్రాలను అందించారు. ఆశా కోఆర్డినేటర్ రవిప్రసాద్, డిప్యూటీ పారా మెడికల్ ఆఫీసర్ వాన సురేశ్ కుమార్ ఉన్నారు.
Similar News
News February 22, 2025
పలాస: తల్లి మందలించిందని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి పద్మనాభపురం శివాజీ నగర్ కాలనీలో శుక్రవారం రాత్రి ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే పరీక్షలు సమీపిస్తుండడంతో చదవమని తల్లి మందలించగా మనస్తాపం చెందిన యశ్వంత్ (17) ఉరేసుకున్నాడు. శనివారం విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టానికి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 22, 2025
SKLM : విద్యార్థిని అశ్లీల చిత్రాలతో వ్యాపారం.. నిందితుల అరెస్టు

విద్యార్థిని వీడియోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి, పోర్న్ సైట్లలో సొమ్ము చేసుకుంటున్న ఇద్దిరిని శ్రీకాకుళం పోలీసులు అరెస్ట్ తెలిపారు. నగరానికి చెందిన ఓ విద్యార్థిని తిరుపతిలో చదువుతున్న సమయంలో సోయల్ పరిచయమయ్యాడు. ఆమెకు తెలియకుండా తీసిన వీడియోలను మార్ఫింగ్ చేసి, కొత్త నంబర్లతో పంపుతూ వేధించేవాడు. ఆ వీడియోలు చూసేందుకు సోయల్ నుంచి క్యూఆర్ కొనుగోలు చేసిన నందికొట్కూరుకు చెందిన రఘును కూడా అరెస్టు చేశారు.
News February 22, 2025
SKLM: గ్రూప్-2 సర్వీసెస్ పరీక్షలకి సమయపాలన తప్పనిసరి

ఈ నెల 23న జరగనున్న గ్రూప్-2 పరీక్షలకు అభ్యర్థులంతా సమయపాలన పాటించాలని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 15 పరీక్షా కేంద్రాల్లో జరుగుతాయన్నారు. శ్రీకాకుళం మండలం – 8, ఎచ్చెర్ల మండలం – 7గా కేటాయించారు. ఈ పరీక్షలు రెండు సెషన్లలో జరుగుతాయని వెల్లడించారు. ఉదయం 10 నుంచి 12.30, మధ్యాహ్నం 3 నుంచి 5.30 వరకు పరీక్షలు ఉంటాయన్నారు.