News August 5, 2024
SKLM: ఆ స్కూల్లో ఒకరే స్టూడెంట్
మీరు చదివింది నిజమే. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం రొట్టవలస పంచాయతీ అవతరబాద్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒక విద్యార్థి మాత్రమే చదువుతున్నాడు. అతని కోసం టీచర్, పాఠశాల పారిశుద్ధ్య కార్మికురాలు, మధ్యాహ్నం భోజనం కార్మికురాలు కూడా పని చేస్తున్నారు. చిన్న గ్రామం కావడంతో స్థానికంగా ఉన్న సుమారు పదిమంది పిల్లలు సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాలకు వెళ్లిపోతున్నారు.
Similar News
News September 18, 2024
ఏపీ పీజీ సెట్ రెండో విడత కౌన్సిలింగ్ ప్రారంభం
ఏపీ పీజీ సెట్-2024 రెండో విడత కౌన్సిలింగ్ ప్రారంభమైంది. ఈ మేరకు జిల్లాలో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో మొదటి విడత అలాట్మెంట్, సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తయింది. 542 సీట్లు ఉండగా 259 ప్రవేశాలు జరిగాయి. ఇంకా 303 సీట్లు మిగిలి ఉండటంతో రెండో విడత కౌన్సిలింగ్‌కు ఈనెల 19 లోపు రిజిస్ట్రేషన్, 21న ఆన్‌లైన్‌లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన, 23, 25న వెబ్ ఆప్షన్ నమోదుకు అవకాశం కల్పించామని అధికారులు తెలిపారు.
News September 18, 2024
శ్రీకాకుళంలో ఓ ప్రైవేటు సంస్థ ఘరానా మోసం
శ్రీకాకుళం రైతు బజారు సమీపంలో ఓ ప్రైవేటు సంస్థ బాధితులను మోసం చేసిన ఘటన చోటుచేసుకుంది. ఆ సంస్థ తక్కువ పెట్టుబడితో లాభాలు పొందవచ్చని ఖాతాదారులను నమ్మించింది. జిల్లాలో సుమారు 3 వేల మంది సభ్యులుగా చేర్చుకుంది. పలు మార్గాల రూపంలో డబ్బులు వసూలు చేసి, 4 నెలలుగా అనుమానం కలగకుండా సక్రమంగా చెల్లింపులు జరిపింది. సంస్థ కార్యకలాపాలు అందుబాటులో లేకపోవడంతో మోసపోయామని బాధితులు పోలీసులకు సమాచారం అందించారు.
News September 18, 2024
నరసన్నపేట: వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం
నరసన్నపేట మండలం దూకులపాడు పంచాయతీ తండ్యాలవానిపేటకు చెందిన శిమ్మ దివ్య అత్తింటి వేధింపులు కారణంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు హుటాహుటిన నరసన్నపేటలోని ఓ స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి మంగళవారం రాత్రి తరలించారు. దివ్య తల్లి ఆదిలక్ష్మి నరసన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఎస్సై దుర్గా ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టమన్నారు.