News November 3, 2024
SKLM: ఇరిగేషన్.. ఇండస్ట్రీ.. ఇదే మా నినాదం: మంత్రి

వలసలను నివారించడమే ధ్యేయంగా శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. భోగాపురం ఎయిర్ పోర్టు, మూలపేట పోర్టులను అనుసంధానిస్తూ కోస్టల్ కారిడార్ నిర్మాణానికి డిపిఆర్‌లు రూపొందిస్తున్నామని అన్నారు. జిల్లా అభివృద్ధిపై గతంలో ఏ సీఎం కూడా జిల్లా అధికారులతో రివ్యూ చేసింది లేదన్నారు.
Similar News
News February 26, 2026
శ్రీకాకుళం: పొన్నాడ వంతెన వద్ద వ్యక్తి దారుణ హత్య?

శ్రీకాకుళం వాంబే కాలనీకి చెందిన పైల మోహన్ రావు (40) పొన్నాడ వంతెన సమీపంలో గురువారం శవమై కనిపించారు. గత రెండు రోజులుగా ఆచూకీ లేని మోహన్‌రావు కోసం కుటుంబ సభ్యులు గాలిస్తుండగా, రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు. మృతుని తలపై తీవ్ర గాయాలు ఉండటంతో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 26, 2026
శ్రీకాకుళం: పాత పైప్‌లైన్ల తొలగింపు

శ్రీకాకుళంలో డయేరియా ప్రబలడానికి నీటి కాలుష్యమే ప్రధాన కారణమని భావిస్తున్న అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ట్యాంకర్ల ద్వారా స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నారు. డ్రైనేజీల పక్కన ఉన్న పాత పైప్‌లైన్లను యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నారు. సేకరించిన 412 వాటర్ శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం విశాఖపట్నం ల్యాబ్‌లకు పంపగా, ప్రాథమిక రిపోర్టుల ప్రకారం నీరు సురక్షితంగానే ఉన్నట్లు సమాచారం.
News February 26, 2026
శ్రీకాకుళం: గూడ్స్ రైలు నుంచి విడిపోయిన బోగీలు

మందస మండలం మకరజోల వద్ద విశాఖ నుంచి కోల్‌కతా వైపునకు వెళ్తున్న గూడ్స్ రైలు ఆరు బోగీలు విడిపోయాయి. మిగిలిన బోగీలతో 100 మీటర్లు ముందుకు వెళ్లి నిలిపివేశారు. దీంతో మకరజోల మీదుగా ఉద్దానం గ్రామాలకు వెళ్లే రహదారిపై రైలు క్రాసింగ్ వద్ద వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. స్థానికులు గంటపాటు ఇబ్బందులు పడ్డారు.


