News October 30, 2024

SKLM: ఈదుపురంలోనే సీఎం చంద్రబాబు సభ

image

సీఎం చంద్రబాబు ఇచ్చాపురం మండలం ఈదుపురంలో నవంబర్ ఒకటో తేదీన పర్యటించనున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారు. ఈదుపురం పర్యటనకు సీఎం రానున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆ గ్రామానికి చేరుకొని టెక్కలి ఆర్డిఓతో కలిసి, పలు వీధుల్లో పర్యటించారు. సభాస్థలి ప్రదేశాన్ని, గ్రామ పరిసరాలను మరోసారి పరిశీలించి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.

Similar News

News October 30, 2024

క్రికెట్ ఆడుతూ సత్యవరం యువకుడు మృతి

image

నరసన్నపేట మండలం సత్యవరంలో విషాదం నెలకొంది. వై.కృష్ణప్రసాద్(25) క్రికెట్ ఆడుతూ మృతిచెందాడు. బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న ఇతను ఈ నెల 27న స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడటానికి వెళ్లాడు. ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఆడుతూ అలసట ఉందని తన గదికి వచ్చేశాడు. గుండెపోటు రావడంతో స్నేహితులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. మంగళవారం సత్యవరంలో అంత్యక్రియలు చేపట్టారు.

News October 30, 2024

శ్రీకాకుళం: ఈదుపురంలోనే సీఎం చంద్రబాబు సభ

image

సీఎం చంద్రబాబు ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో నవంబర్ 1న పర్యటించనున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారు. జిల్లా పర్యటనకు సీఎం రానున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆ గ్రామానికి చేరుకొని టెక్కలి ఆర్డీవోతో కలిసి, పలు వీధుల్లో పర్యటించారు. సభాస్థలి ప్రదేశాన్ని, గ్రామ పరిసరాలను మరోసారి పరిశీలించి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.

News October 29, 2024

శ్రీకాకుళం: ఏపీ టెట్ ఫైనల్ కీ విడుదల

image

ఏపీ టెట్ ఫైనల్ కీ విడుదల అయింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. శ్రీకాకుళం జిల్లాలో 16,185 మంది అభ్యర్థులు టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఈ పరీక్షలు ఈ నెల 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 3 కేంద్రాల్లో ప్రశాంతంగా ముగిశాయి. అభ్యర్థులు ఫైనల్ కీ కోసం https://cse.ap.gov.in/ వెబ్‌సైట్‌లో సందర్శించాలి. నవంబర్ 2వ తేదీన ప్రభుత్వం ఫలితాలను విడుదల చేయనుంది.