News October 30, 2024
SKLM: ఈదుపురంలోనే సీఎం చంద్రబాబు సభ
సీఎం చంద్రబాబు ఇచ్చాపురం మండలం ఈదుపురంలో నవంబర్ ఒకటో తేదీన పర్యటించనున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారు. ఈదుపురం పర్యటనకు సీఎం రానున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆ గ్రామానికి చేరుకొని టెక్కలి ఆర్డిఓతో కలిసి, పలు వీధుల్లో పర్యటించారు. సభాస్థలి ప్రదేశాన్ని, గ్రామ పరిసరాలను మరోసారి పరిశీలించి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
Similar News
News November 10, 2024
శ్రీకాకుళం జిల్లా TODAY TOP NEWS
* శ్రీకాకుళం: కిసాన్ మేళాను ప్రారంభించిన మంత్రి అచ్చెన్న
* మెలకువలు పాటిస్తే కేసులను ఛేదించవచ్చు: SKLM SP
* శ్రీకాకుళం సుడా ఛైర్మన్‌గా రవికుమార్
* ఆమదాలవలస: 25ఏళ్లుగా ఇంట్లో పాము
* రాష్ట్రంలో నియంత పాలన: కృష్ణదాస్
* సోంపేట: పోస్ట్ ఆఫీస్‌లోనే ఆధార్, బ్యాంక్ అకౌంట్ లింక్
* ఇచ్చాపురం: వైసీపీ సీనియర్ నేత మృతి
* సీతంపేటలో అగ్ని ప్రమాదం.. ఇళ్లు దగ్ధం
News November 9, 2024
శ్రీకాకుళం: మెలకువలు పాటిస్తే కేసులను చేధించవచ్చు: SP
సైబర్ నేరాల నియంత్రణ, నేరాలకు సంబంధించిన కేసులను చేధించడానికి సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కె.వి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం జిల్లా పోలీస్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలోఆయన పాల్గొన్నారు. సైబర్ నేరాల దర్యాప్తులో సరైన మెలకువలు పాటిస్తే కేసులను ఛేదించటం చాలా సులుభం అవుతుందని అన్నారు.
News November 9, 2024
శ్రీకాకుళంలో నామినేటెడ్ పదవులు దక్కింది వీరికే..
ఏపీలో నామినేటెడ్ పదవుల రెండో జాబితాను కూటమి ప్రభుత్వం శనివారం ఉదయం విడుదల చేసింది. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 1. TDP నేత రోణంకి కృష్ణంనాయుడుని కళింగ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించారు. 2.JSP నేత నుంచి పాలవలస యశస్విని తూర్పు కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్ పర్సన్‌గా, కోరికాన రవికుమార్‌ను శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా కూటమి ప్రభుత్వం నియమించింది.