News March 14, 2025
SKLM: ఈనెల 20న తపాలా అదాలత్

శ్రీకాకుళం: పోస్టల్ సేవలకు సంబంధించి వ్యక్తిగత ఫిర్యాదుల కోసం ఈనెల 20న మధ్యాహ్నం 2 గంటలకు తపాలా అదాలత్ నిర్వహిస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ వీ హరిబాబు శుక్రవారం తెలిపారు. ఫిర్యాదులను నేరుగా లేదా పోస్ట్ ద్వారా జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయానికి ఈనెల 20 లోపు అందే విధంగా పంపించాలన్నారు. ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఫిర్యాదులు స్వీకరించబడవని వివరించారు.
Similar News
News December 7, 2025
NMMS పరీక్షకు 5516 మంది హాజరు: DEO

శ్రీకాకుళం జిల్లాలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను నిర్వహించిన జాతీయ ఉపకార వేతన ప్రతిభ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని 3 రెవెన్యూ డివిజన్ ప్రధాన కేంద్రాల్లో ఏర్పాటు చేసిన మొత్తం 25 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు మొత్తం 5,617 మంది విద్యార్థులకు గాను 5,516 మంది హాజరు కాగా, 101 మంది గైర్హాజరయ్యారని DEO కే.రవిబాబు ఒక ప్రకటనలో తెలిపారు.
News December 7, 2025
జాక్ పాట్ కొట్టిన సిక్కోలు కుర్రాడు.. రూ.92 లక్షలతో ఉద్యోగం

శ్రీకాకుళం పట్టణం బలగ సమీపంలోని శిరిడిసాయి నగర్కు చెందిన విద్యార్థి మెండ హిమవంశి రూ.92 లక్షల వార్షిక వేతనంలో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఈ అబ్బాయి ముంబయి ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చివరి ఏడాది చదువుతున్నాడు. ఢిల్లీకి చెందిన గ్రావిటన్ రీసెర్చ్ క్యాపిటల్ ఎల్.ఎల్.బి సంస్థ ఇటీవల నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్కు ఎంపికయ్యాడు. పేరెంట్స్, టీచర్లు, కాలనీవాసులు కుర్రాడిని అభినందించారు.
News December 7, 2025
శ్రీకాకుళంలో 104 ఉద్యోగులు నిరసన

గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించే 104 వాహనాల సిబ్బంది వేతన సమస్యలు, గ్రాట్యువిటీ, ఎర్న్డ్ లీవ్ బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. సిబ్బందిలో ఆందోళన నెలకొందని యూనియన్ నేతలు పేర్కొన్నారు.


