News December 13, 2024
SKLM: ఈ నెల 16న ఎస్సీ ఉప వర్గీకరణ కమిషన్ పర్యటన
ఏపీ ప్రభుత్వం నియమించిన షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణ కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా (రిటైర్డ్) ఈనెల 16న శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కమిషన్ ఛైర్మన్ 16న ఉదయం 10 గంటలకు జిల్లాకు చేరుకొని, 11 గంటల నుంచి 2 గంటల వరకు జిల్లా కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమావేశమవుతారు.
Similar News
News December 27, 2024
శ్రీకాకుళం: దోమల నివారణకు చర్యలు
దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బొడ్డేపల్లి మీనాక్షి అన్నారు. జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఫాగింగ్ మిషన్లను శుక్రవారం పంపిణీ చేశారు. జిల్లాకు 50 ఫాగింగ్ మిషన్లు వచ్చాయని అన్ని ప్రభుత్వ ఆసుపత్రిల్లో వీటిని అందుబాటులో ఉంచుతామన్నారు. పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల ద్వారా గ్రామాల్లో ఫాగింగ్ చేయించి దోమలను నివారిస్తామన్నారు.
News December 27, 2024
SKLM: ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీ
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా జవవరి 1 తేదికి సంబంధించిన పింఛన్లను ఒక రోజు ముందుగానే పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 1 వ తేది సెలవు దినం కావడంతో డిసెంబర్ 31న (మంగళవారం) పెన్షన్లు పంపిణీ చేయడానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో 3,13,255 మంది లబ్ధిదారులకు రూ.128.56 కోట్లు అధికారులు ఖాతాలో జమ చేశారు. ఈ మేరకు నగదు పంపిణీకి సిబ్బందితో కలిసి క్షేత్రా స్థాయిలోఅధికారులు చర్యలు చేపట్టారు.
News December 27, 2024
శ్రీకాకుళం: పాసింజర్ రైళ్లు రద్దు..తప్పని అవస్థలు
పలు పాసింజర్ రైళ్లను రద్దు చేస్తూ రైల్వే అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కుంభమేళా జరుగుతున్న నేపథ్యంలో విశాఖ-పలాస పాసింజర్ రైళ్లను ఈనెల 27 నుంచి వచ్చే ఏడాది మార్చి 1 వరకు రద్దు చేస్తున్నామని పేర్కొన్నారు. రైళ్ల రద్దుతో నిరుపేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. ఈ మేరకు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త సర్వీసులను నడపాలన్నారు.