News March 15, 2025

SKLM: ఈ నెల 16 నుండి 17 వరకు ఎపిపిఎస్సీ పరీక్షలు

image

ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణకు పగడ్బందిగా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శనివారం శ్రీకాకుళం కలెక్టరేట్‌లో ఈ పరీక్షల నిర్వహణపై సమీక్షించారు. ఫారెస్టు రేంజ్ అధికారి పరీక్షకు 546, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్లకు 152 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు చెప్పారు. పరీక్షలు ఈ నెల 16 నుంచి 17 వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు.

Similar News

News December 1, 2025

శ్రీకాకుళం: కేంద్ర మంత్రి వర్యా ఆశలన్నీ మీపైనే..!

image

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపై జిల్లా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు తద్వారా జిల్లా రైల్వేస్టేషన్లు అభివృద్ధి, పర్లాఖిమిడి-పలాస, కటక్ నూతన రైల్వే లైన్లు, మూలపేట-భోగాపురం కోస్టల్ కారిడార్ రహదారి నిర్మాణం, జిల్లాలో ప్రత్యేక ITDA ఏర్పాటు తదితర అంశాలు ప్రస్తావించాలని ప్రజలు కోరుతున్నారు.

News December 1, 2025

శ్రీకాకుళం జిల్లాలో 8,485 HIV కేసులు.!

image

జిల్లాలో సుమారు 8,485 HIV కేసులు ఉన్నట్లు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి శ్రీకాంత్ తెలిపారు. అందులో 3,526 మంది పురుషులు, 4,606 మంది స్త్రీలు, 23 ట్రాన్స్ జెండర్స్ ఉన్నారు. శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రి, టెక్కలి జిల్లా ఆసుపత్రి, రాగోలులో ART కేంద్రాలతో పాటు ఇచ్ఛాపురం, సోంపేట, పలాస, కోటబొమ్మాళి,నరసన్నపేట, రణస్థలం,పాతపట్నం,పొందూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ICTC కేంద్రాల ద్వారా మందులు అందిస్తున్నామన్నారు.

News December 1, 2025

పలాస: యాక్సిడెంట్.. యువకుడుకి తీవ్ర గాయాలు

image

పలాస మండలం సున్నాడ గ్రామ జంక్షన్ సమీప రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. సైకిల్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లారు.