News January 14, 2025
SKLM: ఈ నెల 20లోగా డోనర్ పాసులకు పేర్లు నమోదు ఆఖరి

వచ్చే నెల 4వ తేదీన అరసవల్లిలో జరగనున్న రథసప్తమి(సూర్య జయంతి) రోజున దాతలు దర్శనం చేసుకునే వారు డోనర్ పాసులకు పేర్లు నమోదు చేసుకోవాలని ఈవో యర్రంశెట్టి భద్రాజీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల దేవాలయానికి రూ.లక్ష పైబడి విరాళం సమర్పించిన దాతలు ఈ నెల 20వ తేదీ లోగా డోనర్ రసీదుతో పాటుగా ఆధార్ కార్డుతో ఆలయానికి వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలని ఈవో సూచించారు.
Similar News
News December 3, 2025
SKLM: ‘ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఈ-ఆఫీస్ తప్పనిసరి’

వచ్చే వారానికి జిల్లాలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఈ-ఆఫీసు వ్యవస్థను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ పరంగా వివిధ శాఖల దస్త్రాలపై సమీక్ష నిర్వహించారు. ఆర్థికపరమైన దస్త్రాల పరిష్కారంలో చొరవ చూపాలన్నారు. ఈ విషయంలో వెనుకబడిన అధికారులుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
News December 2, 2025
ఉత్తరాంధ్రలో పెరిగిన కాలుష్యం

ఉత్తరాంధ్రలోని మూడు నగరాల్లో కాలుష్యం పెరిగింది. సోమవారం జరిగిన లోక్సభ సమావేశంలో హిందూపూరం MP పార్థసారథి అడిగిన ప్రశ్నకి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ సమాధానం ఇచ్చారు. 2017-18తో పోలిస్తే 2024-25లో ఉత్తరాంధ్రలో గాలి నాణ్యత మరింత దిగజారింది. ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళంలో పరిశ్రమలు వ్యర్థాలను సరిగ్గా శుద్ధి చేయకపోవడం వల్ల కాలుష్యం పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.
News December 2, 2025
తమిళనాడు ప్రమాదం.. 3కి చేరిన శ్రీకాకుళం మృతుల సంఖ్య.!

రామేశ్వరం సమీపంలో కారు, టెంపో ట్రావెల్ బస్సును ఢీకొనగా శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పెదంచల, వీర రామచంద్రపురం (కొండూరు) గ్రామాలకి చెందిన ఇద్దరు యువకులు ఇల్లాకుల నవీన్ (25), పైడి సాయి(26) ఘటనా స్థలంలో మృతి చెందిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలపాలైన గుంటరాజు అనే యువకుడు మధురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది.


