News January 15, 2025
SKLM: ఈ నెల 20లోగా డోనర్ పాసులకు పేర్లు నమోదు ఆఖరి

వచ్చే నెల 4వ తేదీన అరసవల్లిలో జరగనున్న రథసప్తమి(సూర్య జయంతి) రోజున దాతలు దర్శనం చేసుకునే వారు డోనర్ పాసులకు పేర్లు నమోదు చేసుకోవాలని ఈవో యర్రంశెట్టి భద్రాజీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల దేవాలయానికి రూ.లక్ష పైబడి విరాళం సమర్పించిన దాతలు ఈ నెల 20వ తేదీ లోగా డోనర్ రసీదుతో పాటుగా ఆధార్ కార్డుతో ఆలయానికి వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలని ఈవో సూచించారు.
Similar News
News February 12, 2025
దళ్లవలస వీఆర్‌ఓ సస్పెన్షన్

పొందూరు మండలం దళ్లవలస సచివాలయంలో వీఆర్‌ఓ జె.తవిటయ్యను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఆయన మీద ఆరోపణలు రావడంతో తహశీల్దార్ విచారించి కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. గ్రామ సభలను నిర్లక్ష్యం, మ్యూటేషన్‌కు డబ్బులు అడగడం తదితర ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మూడ్రోజులు క్రమశిక్షణ చర్యల కింద ఆర్టీవో కార్యాలయానికి సరెండర్ చేశారు. ఆరోపణలు రుజువు కావడంతో కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
News February 12, 2025
సారవకోట: బాలికపై అత్యాచారం

సారవకోట మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సోమవారం పదేళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. పోలీసుల వివరాల ప్రకారం.. బాలిక సోమవారం పిల్లలతో కలిసి ఆడుకుంటుండగా తినుబండారాలు ఇచ్చి లోపలికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక ఏడుస్తూ విషయం తల్లికి చెప్పింది. తల్లి ఫిర్యాదుతో ఎస్ఐ అనిల్ కుమార్ కేసు నమోదు చేశారు. డిఎస్పీ డి.ప్రసాదరావు విచారణ చేపట్టారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
News February 12, 2025
శ్రీకాకుళం: రైతులకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య

వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేసి, సేవలు మరింత సులభతరం చేసే సంకల్పంతో ప్రభుత్వం రైతులకు 14 అంకెలతో కూడిన ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య (యూనిక్ ఐడి) ఆధార్ కార్డు తరహాలో అందించనున్నదని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో సొంత భూమి కలిగిన ప్రతి రైతుతోనూ ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ పూర్తి చేయించాలన్నారు.