News January 14, 2025

SKLM: ఈ నెల 20లోగా డోనర్ పాసులకు పేర్లు నమోదు ఆఖరి

image

వచ్చే నెల 4వ తేదీన అరసవల్లిలో జరగనున్న రథసప్తమి(సూర్య జయంతి) రోజున దాతలు దర్శనం చేసుకునే వారు డోనర్ పాసులకు పేర్లు నమోదు చేసుకోవాలని ఈవో యర్రంశెట్టి భద్రాజీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల దేవాలయానికి రూ.లక్ష పైబడి విరాళం సమర్పించిన దాతలు ఈ నెల 20వ తేదీ లోగా డోనర్ రసీదుతో పాటుగా ఆధార్ కార్డుతో ఆలయానికి వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలని ఈవో సూచించారు.

Similar News

News February 18, 2025

జి.సిగడాం: పింఛను సొమ్ముతో అధికారి జంప్

image

జి.సిగడాంలోని పెంట గ్రామ సచివాలయంలో సర్వేయర్ పింఛను సొమ్ముతో పరారైనట్లు సచివాలయ సిబ్బంది ఆరోపించారు. ఈ మేరకు వారు సర్వేయర్ భాను ప్రతాప్ రూ. 49 వేలు తీసుకెళ్లాడని సోమవారం తహశీల్దార్ ఎం. శ్రీకాంత్, ఎంపీడీవో రామకృష్ణారావుకు ఫిర్యాదు చేశారు. ఈనెలకు సంబంధించి రూ. 1.66 లక్షల సొమ్ములో రూ. 1.17 లక్షలు పంపిణీ చేసి మిగిలిన సొమ్ముతో ఉడాయించినట్లు వారు ఆరోపించారు.

News February 18, 2025

టెక్కలిలోని హాస్టళ్లలో నిఘా కరవు

image

టెక్కలిలోని ఓ ప్రభుత్వ వసతి గృహంలో ఓ ఇంటర్ విద్యార్థిని గర్భం దాల్చిందన్న వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే బాలికల హాస్టళ్లలో అధికారుల పర్యవేక్షణ, సీసీ కెమెరాల నిఘా లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో వార్డెన్లు, సిబ్బందితో పాటు విద్యార్థినుల రాకపోకలను గమనించడం లేదని , అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

News February 18, 2025

టెక్కలి : ప్రభుత్వ హాస్టళ్లో గర్భం దాల్చిన విద్యార్థిని

image

టెక్కలిలోని ఓ ప్రభుత్వ బాలికల వసతిగృహంలో ఉంటూ ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక విద్యార్థినికి టెక్కలి జిల్లా ఆసుపత్రిలో ప్రసూతి వైద్య పరీక్షలు నిర్వహించడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థిని గర్భం దాల్చిందనే ప్రచారం సోమవారం నాటికి బయటకు పొక్కడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఘటనపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

error: Content is protected !!